Share News

Crime : నా చావుకు ఖాకీలే కార‌ణం

ABN , Publish Date - Aug 16 , 2025 | 12:29 AM

తన చావుకు ఖాకీలే కారణమంటూ నిండు గర్భిణి ఫోనలో వాయిస్‌ రికార్డు చేసి, ఆత్మహత్య చేసుకుంది. పట్టణంలో మూడు నెలల గర్భిణి శ్రావణి (22) ఈనెల 14 ఫ్యానకు ఉరేసుకుని, ఆత్మహత్య ...

Crime : నా చావుకు ఖాకీలే కార‌ణం

ఫిర్యాదును తప్పుదోవ పట్టించారు

పోలీసుల నిర్లక్ష్యంతోనే చనిపోతున్నా

వాయిస్‌ రికార్డు చేసి.. గర్భిణి ఆత్మహత్య

కళ్యాణదుర్గం, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): తన చావుకు ఖాకీలే కారణమంటూ నిండు గర్భిణి ఫోనలో వాయిస్‌ రికార్డు చేసి, ఆత్మహత్య చేసుకుంది. పట్టణంలో మూడు నెలల గర్భిణి శ్రావణి (22) ఈనెల 14 ఫ్యానకు ఉరేసుకుని, ఆత్మహత్య చేసుకుంది. భర్త, అత్తమామల వేధింపులు, పోలీసుల నిర్లక్ష్యంతోనే చనిపోతున్నట్లు ఆమె ఫోనలో రికార్డు చేసుకున్న ఆడియో శుక్రవారం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనను ఎస్పీ జగదీష్‌ సీరియ్‌సగా పరిగణించారు. బాధ్యులపై విచారణకు ఆదేశించారు. కళ్యాణదుర్గానికి చెందిన


శ్రావణికి ఇదే పట్టణానికి చెందిన శ్రీనివాసులుతో మూడేళ్ల క్రితం వివాహమైంది. ఆరునెలలపాటు దంపతులు సంతోషంగా ఉన్నారు. ఆ తరువాత అత్తమామలు కర్రెమ్మ, శివప్ప.. దంపతుల మధ్య గొడవలు పెట్టసాగారని శ్రావణి తల్లిదండ్రులు రామాంజినమ్మ, నాగరాజు వాపోయారు. పెద్దల సమక్షంలో పంచాయితీ చేసినా గొడవలు మాత్రం ఆగలేదు. చివరకి శ్రావణిని చంపాలని పెద్ద కుట్ర పన్నారు. తనను చంపాలని భర్త, అత్తమామాలు చూస్తున్నారని శ్రావణి చెప్పిందని ఆమె తల్లిదండ్రులు ఆవేదన చెందారు. ఇదే విషయమై పట్టణ పోలీసు స్టేషనలో ఈనెల 11న ఫిర్యాదు చేశారు.

కేసును తప్పుదోవ పట్టించారా?

శ్రావణి వాయిస్‌ రికార్డులో పోలీసులు తన కేసును తప్పుదోప పట్టించారని వాపోయింది. ఫిర్యాదును పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించారు. ఫిర్యాదును తన భర్త, అత్తమామలకు అనుకూలంగా రాశారని కన్నీరు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఆమె ఈనెల 14న సాయంత్రం తన పుట్టింట్లో చీరతో ఫ్యానకు ఉరేసుకుని, ఆత్మహత్య చేసుకుంది.

బిడ్డకైనా న్యాయం చేయండి సారూ...

శ్రావణి ఆత్మహత్య చేసుకునే ముందు మొబైల్‌ ఫోన్లో వాయిస్‌ రికార్డు వింటే కన్నీళ్లు తిరుగుతాయి. నా భర్త, అత్తమామలే నా చావుకు కారణం. నేనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతున్నా. నా మూడేళ్ల బిడ్డ పర్ణితకైనా న్యాయం చేయండి. పోలీసులు నా ఫిర్యాదును పట్టించుకోలేదు. తప్పుదోవ పట్టించారు. ఇక.. చనిపోతున్నా... ఇక సెలవు అంటూ కన్నీటి పర్యంతమైంది. ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో శ్రావణి భర్త శ్రీనివాసులు, అత్తమామలు కర్రెమ్మ, శివప్పను పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నట్లు సమాచారం.

Updated Date - Aug 16 , 2025 | 12:29 AM