Women's groups: చిక్కింది చాన్స అని..
ABN , Publish Date - Aug 08 , 2025 | 12:28 AM
మహిళా సంఘాల్లో సభ్యుల నమ్మకాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు యానిమేటర్లు స్వాహా పర్వానికి తెర తీశారు. ఇలాంటి వ్యవహారమే రూరల్ మండలంలోని ఆకుతోటపల్లిలో వెలుగులోకి వచ్చింది. అక్కడ పని చేసే ఓ యానిమేటర్ మహిళా సంఘాల ...
మహిళా సంఘాల సొమ్ము స్వాహా
రూ.30లక్షల మేర కాజేసిన వైనం
రికవరీకి అధికారుల ప్రయత్నాలు
పోలీసులకు మహిళా సంఘాల ఫిర్యాదు
ఆకుతోటపల్లిలో ఓ యానిమేతర్..!
అనంతపురంరూరల్, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): మహిళా సంఘాల్లో సభ్యుల నమ్మకాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు యానిమేటర్లు స్వాహా పర్వానికి తెర తీశారు. ఇలాంటి వ్యవహారమే రూరల్ మండలంలోని ఆకుతోటపల్లిలో వెలుగులోకి వచ్చింది. అక్కడ పని చేసే ఓ యానిమేటర్ మహిళా సంఘాల సొమ్మును తన ఖాతా లోకి మళ్లించుకుని స్వాహా చేశారు. ఇలా దాదాపు రూ.30 లక్షల మేర కాజేసినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న సంబంధిత అధికా రులు వ్యవహారం బయటకు పొక్కకుండా యానిమేటర్‌తో రికవరీ చేయిస్తున్నారు.
పొదుపు.. అప్పుల విచారణతో వెలుగులోకి
వైసీపీ అధికారంలోకి వచ్చాక గ్రామంలో పని చేస్తున్న యానిమేటర్‌ను తొలగించారు. అతడి స్థానంలో అప్పటి రాజకీయ నాయకుల ఒత్తిడితో ఓ మహిళను యానిమేటర్‌గా
నియమించారు. 2021 ఆగస్టు నుంచి 2024 జాన ఆఖరి వరకు ఆమె పని చేశారు. ఆ సమయంలోనే మహిళల సొమ్ము స్వాహా జరిగినట్లు తెలుస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తిరిగి యానిమేటర్ మార్పు జరిగింది. ఈక్రమంలో గ్రూపులు, సభ్యుల అప్పులు, పొదుపు వివరాల విచారణ క్రమంలో స్వాహా వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
నమ్మకం, అమాయకత్వమే ఆసరా
గ్రామాల్లో చాలా మంది కూలి పనులు, వ్యవసాయ పనులు ఇతరత్ర వాటికి వెళ్లి జీవనం సాగిస్తుంటారు. అలా వచ్చిన సొమ్మును డ్వాక్రా సంఘాల ద్వారా పొదుపు చేసుకుంటారు. అవసరార్థం సంఘంలో అప్పు తీసుకుని నెల..నెలా చెల్లిస్తారు. ఈక్రమంలో చాలా మంది యానిమేటర్‌ను మీదనే ఆధారపడి చెల్లింపులు చేస్తుంటారు. ఇదే ఆసరగా ఆ యానిమేటర్ గ్రూపు సభ్యుల సొమ్మును కాజేసినట్లు తెలు స్తోంది. ఈక్రమంలో రూ.పదిహేను లక్షలకుపైగానే కాజేసినట్లు తెలు స్తోంది. తనకంటూ ఓ ప్రత్యేక తీర్మానం చేసుకుని గూప్రుసభ్యులతో సంతకాలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. అందులో తన సొంతబ్యాంకు ఖాతా నెంబరు రాసుకుని తీర్మాన కాపీలను బ్యాంకులో ఇచ్చి..రుణాలు, ఇతరత్ర సొమ్ము మరో రూ.14లక్షలు తన ఖాతాలో జమ చేసుకున్నట్లు తెలుస్తోంది. తన పరిధిలోని ఒక్కో గ్రూపులో రూ.యాభై వేలు మొదలు కొని..రూ.లక్ష, రెండు లక్షలు, నాలుగు లక్షల వరకు గ్రూపు సభ్యులకు తెలియకుండా సొమ్మును తన సొంత ఖాతాలోకి జమచేసుకున్నట్లు సమాచారం. దాదాపు పది గ్రూపులకు సంబంధించిన సభ్యుల సొమ్మును ఎవరికి అనుమానం రాకుండా కాజేసినట్లు చర్చసాగుతోంది.
గుట్టుగా రికవరీ
డ్వాక్రా సంఘంలో జరిగిన అవినీతిని తెలుసుకున్న సంబంధిత అధికారులు గుట్టుచప్పుడుకాకుండా రికవరీ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారుల లెక్కప్రకారమే రూ.20లక్షలకు పైగానే సొమ్ము స్వాహా అయినట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున అవినీతి జరిగిప్పటికీ ఉన్నతాధికా రులకు తెలియకుండా కిందిస్థాయిలోనే వ్యవహారాన్ని సద్దుమణిచేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం. వ్యవహారం బయటకు పొక్కకుండా యానిమేటర్‌కు గడువు ఇప్పించి నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళల పొదుపు సొమ్ము స్వాహాలో అధికారుల పాత్ర కూడా ఉందేమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పోలీసులకు ఫిర్యాదు..
స్వాహా చేసిన సొమ్ము చెల్లించేందుకు యానిమేటర్‌కు ఇచ్చిన గడువు ముగియడంతో సోమవారం గ్రీవెన్సలో పోలీసు ఉన్నాతాధికారులకు పలువురు గ్రూపు సభ్యులు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇటుకలపల్లి పోలీ సులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. గురువారం కూడా ఇద్దరు, ముగ్గురు మహిళలు తమ సొమ్ము స్వాహాపై పోలీ్‌సస్టేషనలో ఫిర్యాదు చేశారు. కొన్ని నెలల కిందట మండలంలోని రాచానపల్లిలోను ఇలాంటి సంఘటనే జరిగింది. ఉన్నతాధికారులు పర్యవేక్షించడంతోపాటు కఠన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందనే చర్చ సాగుతోంది.
స్వాహా నిజమే: రవి, ఏంపీఎం, అనంతపురం రూరల్ మండలం
ఆకుతోటపల్లి గ్రామంలో డ్వాక్రా సంఘాల మహిళలకు సంబంధించి న సొమ్మును గతంలో పని చేసిన యానిమేటర్ తన సొంత ఖాతాలోకి జమ చేసుకున్న విషయం వాస్తవమే. సొమ్ము తన ఖాతాలోకి పడేటట్లు తీర్మానం చేసుకుని, ఆ కాపీని బ్యాంకులో ఇచ్చి, ఆమేరకు తన పరిధిలోని సంఘాల మహిళలకు సంబంధించిన సొమ్మును స్వాహా చేసింది. మా విచారణలో రూ.20లక్షల వరకు యానిమేటర్ గ్రూపు సభ్యులకు తెలియకుండా తీసుకుంది. ఇటీవల మరికొంత మంది తమ సొమ్మును యానిమేటర్ తీసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ లెక్కలు మాదాక రాలేదు. మా దృష్టికి వచ్చిన మేరకు ఆ యానిమేటర్‌తో సొమ్ము రికవరీ చేయిస్తున్నాం. ఇప్పటి వరకు రూ.5లక్షల దాకా చెల్లించారు.
(మరిన్ని అనంతపురం వార్తల కోసం..)