ELECTRICTY: ఇలా చేస్తే ఎలా..?
ABN , Publish Date - Feb 07 , 2025 | 11:54 PM
నియోజకవర్గ కేంద్రం కదిరిలో విద్యుత అధికారులు వ్యవసాయానికి అందించాల్సిన విద్యుత సరఫరా అంతరాయంపై రాష్ట్ర విద్యుత శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరా తీశారు.
ఓబుళదేవరచెరువు, ఫిబ్రవరి7 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ కేంద్రం కదిరిలో విద్యుత అధికారులు వ్యవసాయానికి అందించాల్సిన విద్యుత సరఫరా అంతరాయంపై రాష్ట్ర విద్యుత శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరా తీశారు. మండలంలోని గాజుకుంటపల్లి ఫీడర్‌కు సంబంధించి, ఆ 13 గ్రామాల వ్యవసాయానికి ఉదయం 6గంటలకే 3ఫేస్ విద్యుత సరఫరా చేయాల్సి ఉంది. అయితే మధ్యాహ్నం 3 గంటలవుతున్నా, విద్యుత సరఫరా అంతరాయంపై అధికారులు స్పందించకపోవడంతో కొంతమంది రైతులు విద్యుత శాఖ మంత్రికి ఫోనద్వారా ఫిర్యాదు చేశారు. స్పందించిన మంత్రి వ్యవసాయానికి అందించాల్సిన విద్యుత సరఫరాపై ఆరాతీసి, అధికారులను మందలించారు. దీంతో అధికారులు వెంటనే విద్యుత మరమ్మతులు చేసి, వ్యవసాయానికి విద్యుత సరఫరా అందించారు. గాజుకుంటపల్లి ఫీడర్‌కు సంబంధించిన అవుట్‌గోయింగ్ ద్వారా విద్యుత సరఫరా చేసే బ్లేడ్ తెగిపోవడంతో, విద్యుత సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దాదాపు పది గంటలపాటు విద్యుత సరఫరా అంతరాయంతో రైతులు బోర్లవద్దే పడిగాపులు గాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంత్రి ఆదేశాలతో మధ్యాహ్నం 3గంటలపైన వ్యవసాయానికి విద్యుత సరఫరా చేశారు. విద్యుతశాఖ సిబ్బంది నిర్లక్ష్యంపై ఏడీఈ ఓబులేసు మండలకేంద్రంలోని విద్యుత సబ్‌స్టేషనలో ఫీడర్ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి మందలించారు.