Share News

ELECTRIC: విద్యుత పరికరాలు అమ్మేస్తున్నాడు

ABN , Publish Date - Aug 05 , 2025 | 11:50 PM

మండల కేంద్రంలోని ట్రాన్సకో కార్యాలయం పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. విద్యుత పరికరాలను, విద్యుత స్తంభాలను వాటికి ఉన్న అల్యూమిని యమ్‌ వైర్లను అందినకాటికి అమ్ముకుని సొమ్ముచేసుకుంటున్నట్టు ఆ శాఖలోని కొందరు బహి రంగంగానే చర్చించుకుంటున్నారు.

ELECTRIC: విద్యుత పరికరాలు అమ్మేస్తున్నాడు
Mutt street without electric poles

ఓ ఉద్యోగిపై మండల ప్రజల ఆరోపణ

కొత్తచెరువు, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ట్రాన్సకో కార్యాలయం పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. విద్యుత పరికరాలను, విద్యుత స్తంభాలను వాటికి ఉన్న అల్యూమిని యమ్‌ వైర్లను అందినకాటికి అమ్ముకుని సొమ్ముచేసుకుంటున్నట్టు ఆ శాఖలోని కొందరు బహి రంగంగానే చర్చించుకుంటున్నారు. కూలిపోతాయన్న నెపంతో ఆ ఉద్యోగి మండల కేంద్రంలోని మఠం వీధిలోని రెండు ఇనుప విద్యుత స్తం భాలను, వాటికున్న అల్యూమినియం వైరును తొలగించి అమ్ముకున్నట్టు ఆ వీధిలోని ప్రజలు ఆరోపిస్తున్నారు. విద్యుత లైన్లను తొలగించ డంతో ఆ వీధిలో విద్యుత సరఫరా నిలిచిపోయిందని, దీంతో తాము వంద మీటర్ల దూరంలో ఉన్న విద్యుత స్తంభాల నుంచి ఇళ్లకు కరెంటు తీసుకున్నామని కాలనీ వాసులు పేర్కొంటు న్నారు. తొలగించిన రెండు స్తంభాల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేసి, లైన లాగాలని ఆ ఉద్యోగిని ఎన్నిసార్లు అడిగినా పెడచెవిన పెడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలో చాలా చోట్ల ఇనుప విద్యుత స్తంభాలను వాటిని మార్చే నెపం తో ఆయన తొలగించాడని చెబుతున్నారు. ఇప్పటివరకు అలా తొలగించిన దాదాపు 50 దాకా స్తంభా లను అమ్ముకున్నారని ఆ శాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. అలాగే కొన్ని ఇనుప విద్యుత స్తంభాలను దర్గాలోని ఈద్గా వద్ద భద్రపరచి అమ్మకాలు జరుపుతున్నట్లు సమాచారం. కంచే చేను మేసిన చందంగా కొత్తచెరువులో ఆ ఉద్యోగి తీరు తయారైందని మండల ప్రజలే బహిరంగంగా అంటున్నారు. ఈ విషయంపై ట్రాన్సకో ఏఈ వెంకటేశనాయక్‌ను వివరణ కోరగా... ట్రాన్పకోకు సంబంధించిన పరికరాలు, స్తంభాలను అమ్ముకున్నట్టు తెలిస్తే బాధ్యులపై ఉన్నతాధికా రులకు తెలియజేసి, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మఠం వీధిలో పరిశీలించి, విచారణ చేపడుతామన్నారు. ఎవరైతే స్తంభాలను, వైర్లను అమ్ముకున్నారో వారిపై చర్యలు తీసుకుంటామని ఏఈ తెలిపారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Aug 05 , 2025 | 11:50 PM