శరణు.. శరణు.. గురురాయా..
ABN , Publish Date - Aug 13 , 2025 | 01:04 AM
రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాల్లో భాగంగా మంగళవారం మొదటిరోడ్డులోని మంత్రాలయ రాఘవేంద్రస్వామి మఠంలో ఉత్తరారాధన వేడుకలు...
అనంతపురం టౌన, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాల్లో భాగంగా మంగళవారం మొదటిరోడ్డులోని మంత్రాలయ రాఘవేంద్రస్వామి మఠంలో ఉత్తరారాధన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారి బృందావనానికి వివిధ అభిషేకాలు చేసి, ప్రత్యేకంగా అలంకరించారు. రథంలో స్వామివారి ఉత్సవమూర్తిని ఆశీనులు గావించి, పురవీధుల్లో ఊరేగించారు.