Share News

MLA KANDIKUNTA: మహిళల ఆర్థికాభివృద్ధికే గోకులాలు

ABN , Publish Date - Jan 12 , 2025 | 12:08 AM

మహిళల ఆర్థికాభివృద్ధి కోసమే కూటమి ప్రభుత్వం గోకులాలను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ అన్నారు. శనివారం మండలంలోని గోళ్లవారిపల్లి, కోటూరు గ్రామాల్లో మహిళా రైతుల కోసం నిర్మించిన గోకులం షెడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు.

MLA KANDIKUNTA: మహిళల ఆర్థికాభివృద్ధికే గోకులాలు
MLA Venkataprasad is speaking

తనకల్లు, జనవరి 11(ఆంధ్రజ్యోతి): మహిళల ఆర్థికాభివృద్ధి కోసమే కూటమి ప్రభుత్వం గోకులాలను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ అన్నారు. శనివారం మండలంలోని గోళ్లవారిపల్లి, కోటూరు గ్రామాల్లో మహిళా రైతుల కోసం నిర్మించిన గోకులం షెడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగడానికి గోకులం షెడ్లు ఉపయోగపడతాయన్నారు. మండలానికి 55 షెడ్లను మంజూరు చేసినట్లు చెప్పారు. నియోజకవర్గంలోనే ఎక్కువగా తనకల్లు మండలానికి మంజూరైనట్లు తెలిపారు. వైసీపీ పాలనలో రైతులు, రైతులు, మహిళా సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. మహిళల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. తహసీల్దార్‌ శోభాసువర్ణమ్మ, ఎంపీడీఓ రెడ్డెప్ప, ఏపీఓ మరియమ్మ, ఏపీడీ రమే్‌షబాబు, డాక్టర్‌ హరినాథ్‌రెడ్డి, వివిధ శాఖలాధికారులు, టీడీపీ కన్వీనర్‌ రెడ్డిశేఖర్‌రెడ్డి, రాజారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ రవీంద్రారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, రమణారెడ్డి, మహబూబ్‌బాషా పాల్గొన్నారు.

నల్లచెరువు: పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా మండలంలోని కుంట్లపల్లివాండ్లపల్లిలో నిర్మించిన గోకులం షెడ్‌ను ఎమ్మెల్యే కందికంట వెంకటప్రసాద్‌ శనివారం ప్రారంభించారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మండలకేంద్రంలోని వడ్డె ఓబన్న జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం దేవరింటిపల్లిలో పలు కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రవికుమార్‌, ఎంపీడీఓ రఘునాథ్‌గుప్త, ఏపీడీ రమే్‌షబాబు, టీడీపీ కన్వీనర్‌ రాజశేఖర్‌, అంజనప్ప, నాగభూషణనాయుడు, దాద్దెం శివారెడ్డి, రామచంద్ర, ఆనంద్‌, బషీర్‌ అహమ్మద్‌ పాల్గొన్నారు.

నంబులపూలకుంట: మండలంలో నిర్మించిన గోకులం షెడ్లను శనివారం ఎంపీడీఓ ఆంజనప్ప ప్రారంబించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతనంగా నిర్మించిన షెడ్లను ప్రారంభించామన్నారు. టీడీపీ కన్వీనర్‌ చంద్రశేఖర్‌నాయుడు, నరసింహులు, సర్పంచ అంజనమ్మ, సిద్ధయ్య, మౌలా, చాంద్‌బాషా, బీజేపీ మండలాధ్యక్షుడు బాబ్‌జాన, రామమోహన, ఏపీఓ చంద్రశేఖర్‌, ఎఫ్‌ఏ లక్ష ్మయ్య పాల్గొన్నారు.

గాండ్లపెంట: ఉపాధి పథకంలో నిర్మించిన గోకులాల షెడ్లను మండల అధికారులు, కూటమి నాయకులు శనివారం ప్రారంభించారు. కటారుపల్లి క్రాస్‌, గాండ్లపెంట, నల్లగుట్టతండాలో నిర్మించిన గోకులం షెడ్లును వారు ప్రారంభించారు. ఎంపీడీఓ వెంకటరామిరెడ్డి, పశువైద్యాధికారి చెన్నకేశవులనాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2025 | 12:09 AM