Houses : అధనపు సాయం
ABN , Publish Date - Mar 12 , 2025 | 01:07 AM
ఇళ్లు కట్టుకుంటున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. వైసీపీ ప్రభుత్వంలో మంజూరై వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేసుకు నేందుకు అదనంగా నిధులు చెల్లించేందుకు శ్రీకారం చుట్టింది. గత ప్రభు త్వం చెల్లించిన మొత్తంతో పాటు బీసీ, ఎస్సీలకు అదనంగా రూ.50వేలు, ఎస్టీలకు రూ.75వేలు చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 4232మంది ఎస్సీ లబ్ధిదారులకు ...

అసంపూర్తి ఇళ్ల నిర్మాణానికి చేయూత
అనంతపురం క్లాక్‌టవర్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ఇళ్లు కట్టుకుంటున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. వైసీపీ ప్రభుత్వంలో మంజూరై వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేసుకు నేందుకు అదనంగా నిధులు చెల్లించేందుకు శ్రీకారం చుట్టింది. గత ప్రభు త్వం చెల్లించిన మొత్తంతో పాటు బీసీ, ఎస్సీలకు అదనంగా రూ.50వేలు, ఎస్టీలకు రూ.75వేలు చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 4232మంది ఎస్సీ లబ్ధిదారులకు అదనంగా రూ.21కోట్లు, ఎస్టీలు 904మందికి రూ.70లక్షలు, బీసీలు 15882మందికి రూ.80కోట్లు మొత్తంగా 21018మంది లబ్ధిదారులకు రూ.102కోట్లు చెల్లించేందుకు
కూటమి ప్రభుత్వం అంగీకరించింది. దీంతో లబ్ధిదారుల్లో ఆనందం నెలకొంది. గృహ నిర్మాణ వ్యయం పెరిగిన నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
పేదలకు సువర్ణావకాశం: శైలజ, హౌసింగ్ పీడీ
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పేదలకు వరంగా మారనుంది. గత ప్రభుత్వంలో ఇళ్లు మంజూరై, బిల్లులు కాక మధ్యలో చాలా ఇళ్లు ఆగిపోయాయి. అలాంటి లబ్ధిదారులకు ఇదో సువర్ణ అవకాశం. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహంతో ఆగిపోయిన ఇంటి నిర్మాణాలను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకోవాలి. పేదలందరికీ సొంత ఇళ్లు ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....