Share News

Finger : ఎక్స్‌క్యూజ్‌ మీ..! నా వేలు మీకు దొరికిందా..?

ABN , Publish Date - Mar 14 , 2025 | 12:38 AM

వేలు దొరకడం ఏమిటి..? చాన్నాళ్లుగా ప్రశాంతంగా ఉన్నాం కదా..! మళ్లీ ఏమైనా ఫ్యాక్షన గొడవలు జరిగాయా..? ఎవరైనా నరుక్కున్నారా..? అని కంగారు పడొడ్దు..! వేలంటే వేలు కాదు..! వేలు లాంటిది..! రబ్బరుతో తయారు చేసింది. రేషన బియ్యం వేసే సమయంలో.. కార్డుదారు లేకుండా, రబ్బర్‌ వేలును ఉపయోగిస్తున్నారన్నమాట..! ఆ వేలు.. పొరపాటున జారిపోయి.. బియ్యంలో ...

Finger : ఎక్స్‌క్యూజ్‌ మీ..! నా వేలు మీకు దొరికిందా..?

వేలు దొరకడం ఏమిటి..? చాన్నాళ్లుగా ప్రశాంతంగా ఉన్నాం కదా..! మళ్లీ ఏమైనా ఫ్యాక్షన గొడవలు జరిగాయా..? ఎవరైనా నరుక్కున్నారా..? అని కంగారు పడొడ్దు..! వేలంటే వేలు కాదు..! వేలు లాంటిది..! రబ్బరుతో తయారు చేసింది. రేషన బియ్యం వేసే సమయంలో.. కార్డుదారు లేకుండా, రబ్బర్‌ వేలును ఉపయోగిస్తున్నారన్నమాట..! ఆ వేలు.. పొరపాటున జారిపోయి.. బియ్యంలో కలిసిపోయింది..! దానికోసం వెతుక్కుంటూ.. ఓ వ్యక్తి ‘నా వేలు దొరికిందా..? నా వేలు దొరికిందా..?’ అని అందరినీ ఆరా తీయడంతో అసలు గుట్టు బయట పడింది.

ఇంతకీ ఎవరి వేలు...

యాడికి మండల కేంద్రంలోని కొండకింద వీధికి చెందిన ఓ మహిళ బెంగళూరులో ఉంటున్నారు. ఆమె కుటుంబానికి స్థానికంగా రేషనకార్డు ఉంది. సమీప బంధువు వారి రేషన బియ్యం తీసుకుంటున్నారు. ప్రతినెలా ఆమె సరుకుల కోసం బెంగళూరు నుంచి యాడికి రావాలంటే ఇబ్బంది.. ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీంతో ఆమె బంధువు ‘రబ్బరు వేలు’ ఉపాయం ఆలోచించారు. రూ.3 వేలు ఖర్చు చేసి, ఆమె వేలి ముద్రలతో కృత్రిమ వేలును తయారు చేయించారు. మార్చి నెల రేషన సరుకుల కోసం వేలిముద్ర వేసే సమయంలో అది జారిపోయి బియ్యంలో కలిసిపోయినట్లు తెలిసింది. ఆలస్యంగా గమనించిన ఆ వ్యక్తి, రేషన బియ్యం కోసం వచ్చిన అందరినీ ‘వేలు దొరికిందా..?’ అని ఆరా తీశారు. రబ్బరు వేలు వ్యవహారం


యాడికిల్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. కృత్రిమ వేలిముద్రతో రేషన డీలర్‌ సరుకులను ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. కొందరు రేషన డీలర్లు, ఎండీయూ ఆపరేటర్లు కృత్రిమ వేళ్లను వాడుతున్నట్లు తెలిసింది. ఎండీయూ ఆపరేటర్‌ వేలిముద్ర వేయనిదే రేషన సరుకుల పంపిణీకి అవకాశం లేదు. దీంతో వారి వేలి ముద్రలను తయారు చేయిస్తున్నారని సమచారం. ఈ పద్ధతి కొనసాగితే.. వేలి ముద్రలను అక్రమాలకు వినియోగించే ప్రమాదం ఉంది. అధికారులు విచారించి, చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

- ఆంధ్రజ్యోతి, యాడికి


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 14 , 2025 | 12:38 AM