MLA KANDIKUNTA: వేసవిలో తాగునీటి ఎద్దడి రానివ్వద్దు
ABN , Publish Date - Feb 22 , 2025 | 12:08 AM
వేసవిలో తాగునీటి ఎద్దడి రాకూడదని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
కదిరి, ఫిబ్రవరి21 (ఆంధ్రజ్యోతి): వేసవిలో తాగునీటి ఎద్దడి రాకూడదని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో గడిచిన 8 నెలల్లో అభివృద్ధి, సంక్షేమంతోపాటు, గతంలో వైసీపీ నాయకులు చేసిన అక్రమాలను కూడా వెలికి తీశామన్నారు. తప్పు చేసినవారికి దండన తప్పదన్నారు. గత వైసీపీ పాలనలో కొంతమంది నాయకులు ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే, మరికొంతమంది ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతూ ప్రభుత్వ పట్టాలను దళారులతో విక్రయించి, సొమ్ము చేసుకున్నారన్నారు. వారు చేసిన అక్రమాలను వెలికి తీస్తూనే ఉంటామన్నారు. అనంతరం ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అసరమైన సౌకర్యాలు కల్పిస్తామని, మెరుగైన వైద్య సేవలు అందించడానికి నిధులు సమకూర్చుతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నాటుసారాను నిర్మూలించేందుకు నవోదయం పేరుతో చేపట్టిన కార్యక్రమ పోస్టర్లను ఎమ్మెల్యే విడుదల చేశారు. అలాగే ఆర్టీసీ డిపోకు నూతనంగా వచ్చిన ఐదు బస్సులను ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు. డిపో మేనేజర్ మైనోద్దీన, ఆసుప్రతి కమిటీ సభ్యులు వేణుగోపాల్, రెడ్డిబాషా, లక్ష్మణ్, డాక్టర్ హుస్సేన, ఎక్సైజ్ సీఐ వీరారెడ్డి పాల్గొన్నారు.
వాటర్‌షెడ్‌తోనే రైతులకు ప్రయోజనం
నంబులపూలకుంట,: రైతులకు వాటర్ షెడ్ ఎంతోఉపయోకరమని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. శుక్రవారం స్థానిక జిల్లాపరిషత ఉన్నత పాఠశాలలో వాటర్ షెడ్ యాత్ర కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ రాయలసీమను కరువు ప్రాంతంగా భావించే వాటర్‌షెడ్ యాత్ర చేపట్టామన్నారు. మండలంలో ఎక్కువగా వర్షాలు కురుస్తాయన్నారు. అందువల్లే రాష్ట్రంలోనే వాటర్ షెడ్ కార్యక్రమాన్ని ప్రారభించడం ఆనందంగా ఉందన్నారు. వాటర్‌షెడ్ చైర్మన మహబూబ్‌బాషా, సర్పంచ అంజనమ్మ, ఎంపీపీ రాము, ఏపీడీ సుధాకర్‌రెడ్డి, చైతన్య, కృష్ణచైతన్య, రమే్‌షబాబు, తహసీల్దార్ దేవేంద్రనాయక్, ఎంపీడీఓ అంజనప్ప, ఎంఈఓ సుబ్బిరెడ్డి, హెచఎం శిరీషా పాల్గొన్నారు.