APTF: ఒకేరోజు రెండు సమావేశాలు వద్దు
ABN , Publish Date - Feb 13 , 2025 | 12:05 AM
ఒకే రోజు స్కూల్, కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించడం సరికాదని పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఏపీటీఎఫ్, ఎస్టీయూ నాయకులు వేర్వేరుగా విద్యాశాఖ అధికారుల తీరును ఖండించారు.

అనంతపురం విద్య, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): ఒకే రోజు స్కూల్, కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించడం సరికాదని పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఏపీటీఎఫ్, ఎస్టీయూ నాయకులు వేర్వేరుగా విద్యాశాఖ అధికారుల తీరును ఖండించారు. విద్యాశాఖ విడుదల చేసిన పాఠశాల కాంప్లెక్స్ సమావేశాల సమయాలను మార్చాలని ఏపీటీఎఫ్ నాయకులు కోరారు. ఆ సంఘం నాయకులు డీఈఓ ప్రసాద్‌బాబుకు వినతి పత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, ప్రధానకార్యదర్శి సిరాజుద్దీన మాట్లాడుతూ.. స్కూళ్లలో తరగతులు బోధించి, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించి 20 కిలోమీటర్ల నుంచి 25 కిలోమీటర్ల దూరంలోని కాంప్లెక్స్ మీటింగ్స్‌కు హాజరుకావడం అసాధ్యమని అన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు నరసింహులు, వెంకటమరరణ, సర్ధార్‌వలి, చిదంబరరెడ్డి, బాలరామ్మోహన, సూర్యనారాయణ, ఈశ్వరయ్య, తిప్పేస్వామి,మహేష్ పాల్గొన్నారు.
పాత పద్ధతిలోనే నిర్వహించాలి: ఎస్టీయూ
కాంప్లెక్స్ సమావేశాలను పాత పద్ధతిలోనే నిర్వహించాలని ఎస్టీయూ నేతలు డిమాండ్ చేశారు. ఆ సంఘం నాయకులు బుధవారం ఎస్టీయూ కార్యాలయంలో సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి మాట్లాడుతూ.. స్కూల్ కాంప్లెక్స్ సమావేశం నిర్వహణ సమయాలు మార్పు చే స్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. మధ్యా హ్నం స్కూల్ బంద్ చేసిన తర్వాత స్కూళ్ల నుంచి పిల్లలు ఇళ్లకు, టీచర్లు కాంప్లెక్స్ మీటింగ్స్ వెళ్లడం ఇబ్బందికరం అన్నారు. మ హిళా టీచర్లు 12 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల దూరం కాం ప్లెక్స్ సమావేశాలకు ఎలా వెళ్తారంటూ ప్రశ్నించారు. కార్యక్రమం లో ఆ సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి రామాంజనేయులు, నా యకులు సూర్యుడు, చంద్రశేఖర్, శివయ్య ఆచారి, నాగభూషణ, వాణి, కిషోర్, సురే్‌షబాబు, కృష్ణమోహన, ఫణిభూషణ్ పాల్గొన్నారు.