Share News

GIDUGU: వ్యవహారిక భాషా ఉద్యమకారుడు గిడుగు

ABN , Publish Date - Aug 30 , 2025 | 12:25 AM

తెలుగు భాషాభివృద్ధికి పాటుపడదామని మున్సిపల్‌ చైర్మన రమేష్‌ అన్నారు. శుక్రవారం మున్సిపల్‌ కార్యాలయంలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున, వైస్‌ చైర్మన బలరాంరెడ్డి, జబీవుల్లా, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

GIDUGU: వ్యవహారిక భాషా ఉద్యమకారుడు గిడుగు

==========================

వ్యవహారిక భాషా ఉద్యమకారుడు గిడుగు

ఫ ప్రిన్సిపాల్‌ సుదర్శన

పెనుకొండ, ఆగస్టు29(ఆంధ్రజ్యోతి): వ్యవహారిక భాషా ఉద్యమకారుడు గిడుగు రామ్మూర్తి పంతులు అని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సుదర్శన అన్నారు. శుక్రవారం గిడుగు రామ్మూర్తి జయంతిని కళళాశఆలలో ఘనంగా నిర్వహించారు. రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అధ్యాపకులు హఫీజ్‌, బషీర్‌, ఎనఎ్‌స మూర్తి, రామారావు, సుధారాణి, రాజగోపాల్‌, స్రవంతి, ఎనఎ్‌సఎ్‌స పీఓలు శివన్న, రవికుమార్‌, శ్రీలేఖ పాల్గొన్నారు. సత్యసాయి కళాశాలలో ఏఓ కేశవయ్య ఆధ్వర్యంలో గిడుగు రామ్మూర్తి జయంతిని ఘనంగా నిర్వహించారు. కేక్‌కట్‌చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. తెలుగు అధ్యాపకుడు మంజునాథ్‌, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మడకశిర టౌన(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఎంజేపీ జూనియర్‌ కళాశాలలో శుక్రవారం తెలుగుభాషాదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌కే బషీరున్నీసా మాట్లాడుతూ భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి అన్నారు. స్థానిక ప్రభుత్వ ఎస్‌వైఆర్‌ డిగ్రీ కళాశాలలో తెలుగుభాషాదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ శ్రీనివాసులు అధ్వర్యంలో నిర్వహించారు.

గిడుగు రామ్మూర్తి చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న ప్రిన్సిపల్‌, అధ్యాపకులు


హిందూపురం(ఆంధ్రజ్యోతి): తెలుగు భాషాభివృద్ధికి పాటుపడదామని మున్సిపల్‌ చైర్మన రమేష్‌ అన్నారు. శుక్రవారం మున్సిపల్‌ కార్యాలయంలో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున, వైస్‌ చైర్మన బలరాంరెడ్డి, జబీవుల్లా, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన తెలుగు బాషా దినోత్సవంలో ప్రిన్సిపాల్‌ ప్రగతి మాట్లాడుతూ గ్రాంధికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకురావాలని ఉద్యమాలు చేసి తెలుగు సాహిత్య వైతాళికుడుగా పేరొందిన గిడుగు వెంకటరామూర్తిని తెలుగువారు గుర్తుచేసుకోవాలన్నారు. పాంచజన్య బ్రిలియన్స పాఠశాలలో తెలుగుభాష దినోత్సవం సందర్భంగా చిన్నారులు పలు వేషధారణలతో ఆకట్టుకున్నారు.

అమరాపురం(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో జాతీయ క్రీడా దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఆదర్శ పాఠశాల, జూనియర్‌ కళాశాల, కస్తూర్బా ఉన్నత పాఠశాలలు, ప్రైవేట్‌ పాఠశాలల్లో శుక్రవారం వేడుకలను నిర్వహించారు. అనంతరం సాహిత్య వైతాళికుడు, తెలుగుభాష శాస్త్రవేత్త గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు.

Updated Date - Aug 30 , 2025 | 12:25 AM