MP BK: భగీరథుడి విగ్రహావిష్కరణ
ABN , Publish Date - Feb 18 , 2025 | 12:05 AM
మండలంలోని జంగాలపల్లి గ్రామంలో హిందూపురం ఎంపీ బీకే పార్థసారథ భగీరథ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
పరిగి, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): మండలంలోని జంగాలపల్లి గ్రామంలో హిందూపురం ఎంపీ బీకే పార్థసారథ భగీరథ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ 2018 నుంచి 2019 వరకు గ్రామంలో భగీరథ విగ్రహావిష్కరణ వాయిదా పడుతూ ఇప్పటికి ఏర్పాటుకావడం సంతోషకరంగా ఉందన్నారు. జంగాలపల్లి గ్రామంలో 2016లో గ్రామానికి తారురోడ్డు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అప్పటి టీడీపీ ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా తాను రహదారి నిర్మాణం చేపట్టానన్నారు. ఇళ్ల నిర్మాణాలు కూడా అప్పుడే జరిగాయన్నారు. ఆలయ నిర్మాణం కోసం ప్రజల నుంచి వినతులు వచ్చాయని వాటిని త్వరలో పరిష్కరిస్తామన్నారు. అనంతరం గ్రామంలోని మహిళలు గ్రామం నుంచి కాటమప్ప ఆలయం వరకు జ్యోతుల ఉత్సవం నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. మండల కన్వీనర్ గోవిందరెడ్డి, సర్పంచ బాలాజీ, వడ్డే హనుమయ్య, శేఖర్, ఆశ్వత్థప్ప, శ్రీనివాసరెడ్డి, నరసింహులు, కుమార్, చౌడప్ప పాల్గొన్నారు.
రైతు సమస్యలు పరిష్కరించాలి
పెనుకొండ రూరల్: రైతుల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎంపీ బీకే పార్థపారథి సూచించారు. రొద్దం మండలంలోని మరువపల్లి గ్రామంలో తహసీల్దార్ ఉదయ్‌శంకర్‌రాజు, రెవెన్యూ అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వివిధ సమస్యలతో వచ్చే రైతులు, ప్రజలకు సహకరిస్తూ ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి రొద్దం నరసింహులు పాల్గొన్నారు.