Share News

CPM: అమితషాను మంత్రి పదవి నుంచి తొలగించాలి

ABN , Publish Date - Jan 20 , 2025 | 12:09 AM

అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమితషాను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్‌ చేశారు.

CPM: అమితషాను మంత్రి పదవి నుంచి తొలగించాలి
Left leaders talking

గుంతకల్లుటౌన, జనవరి 19(ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం మంత్రి అమితషాను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్‌ చేశారు. అమితషా రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆదివారం వామపక్షపార్టీల ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు శ్రీనివాసులు, సీపీఐ వీరభద్రస్వామి, సీపీఎం మారుతిప్రసాద్‌, జగ్గలిరమేష్‌, కసాపురం రమేష్‌, సాకేనాగరాజు, సురేంద్ర, గోపినాథ్‌, రాము, రామాజంఇనేయులుయాదవ్‌, దేవేంద్ర, కుళ్లాయిస్వామి పాల్గొన్నారు.

ఉరవకొండ: అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమితషా రాజీనామా చేయాలని సీపీఐ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు. పట్టణంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఆదివారం వారు ఆందోళన చేపట్టారు. నాయకులు మల్లికార్జున, బ్యాళ్లప్రసాద్‌ మాట్లాడుతూ దేశంలో బడుగు, బలహీన వర్గాలు ఆరాధించే దైవం అంబేడ్కర్‌ అని, అలాంటి వ్యక్తిని అవమానించడం దారుణమన్నారు. సీపీఐ నాయకులు సుల్తాన, గౌస్‌, తిప్పయ్య, మల్లేష్‌, కాంగ్రెస్‌ నాయకులు శ్రీన, అబ్బాస్‌, రమేష్‌ పాల్గొన్నారు

Updated Date - Jan 20 , 2025 | 12:09 AM