TC VARUN: నగరంలో అహుడా చైర్మన పర్యటన
ABN , Publish Date - Feb 06 , 2025 | 11:41 PM
అహుడా చైర్మన టీటీసీ వరుణ్ అనంతపురం నగరంలో గురువారం పర్యటించారు. అధికారులతో కలిసి పలు ప్రాంతాల్లో కలియ తిరిగారు.
అనంతపురం క్రైం,ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): అహుడా చైర్మన టీటీసీ వరుణ్ అనంతపురం నగరంలో గురువారం పర్యటించారు. అధికారులతో కలిసి పలు ప్రాంతాల్లో కలియ తిరిగారు. అహుడా ఆధ్వర్యంలో నగరంలో మహిళలకు మెట్రో నగరాల తరహాలో అత్యాధునిక టాయ్‌లెట్లను ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రభుత్వ స్థలాలను చూశారు. ప్రస్తుతం పాతూరు పరిధిలో ఒకటి, న్యూటౌన పరిధిలో మరొకటి ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. మహిళలు కాలకృత్యాలు తీర్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇలా వారి సమస్యలు తీర్చినట్టవుతుందని చైర్మన అన్నారు. అహుడా ప్లానింగ్ ఆఫీసర్ ఇషాక్, సెక్రటరీ గౌరీశంకర్, ఈఈ దుష్యంత, సర్వేయర్ శరతకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.