FERTILIZERS: అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే చర్యలు
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:08 AM
అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, దుకాణాలు సీజ్‌చేస్తామని తహసీల్దార్ సౌజన్యలక్ష్మి హెచ్చరించారు. సోమవారం స్థానిక ఎరువుల దుకాణాలను ఆమె తనిఖీ చేశారు.
లేపాక్షి, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, దుకాణాలు సీజ్‌చేస్తామని తహసీల్దార్ సౌజన్యలక్ష్మి హెచ్చరించారు. సోమవారం స్థానిక ఎరువుల దుకాణాలను ఆమె తనిఖీ చేశారు. ఆమె స్టాక్ రిజిస్టర్, అనుమతి పత్రాలు పరిశీలించి సిబ్బందికి దుకాణ యజమానులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. తప్పనిసరిగా ఎమ్మార్పీ ధరలకు విక్రయించాలన్నారు. వ్యవసాయ అధికారి శ్రీలత, ఏఎ్‌సఐ షర్ఫుద్దీన పాల్గొన్నారు.
గుడిబండ(ఆంధ్రజ్యోతి): మండలంలోని మోరుబాగల్ గ్రామంలో లక్ష్మీ వెంకటేశ్వర స్టోర్స్, సుబ్రమణేశ్వర ఎరువుల దుకాణాలను విజిలెన్స అధికారులు, తహసీల్దార్ శ్రీధర్, ఏఓ వీరనరేష్ సోమవారం తనిఖీ చేశారు. షాపుల్లో నిలువ ఉంచిన ఎరువులను పరిశీలించారు. రైతులకు ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు చేపడతామని డీలర్లను హెచ్చరించారు. విజిలెన్స సీఐ శ్రీనివాసులు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ సురే్‌షకుమార్, విజిలెన్స ఎస్‌ఐ గోపాలుడు, రాజకుల్లాయప్ప, రైతు సేవాకేంద్రం అధికారులు రుహీన, వెంకటేశబాబు పాల్గొన్నారు.