Minister payyaula : వంద రోజుల్లోనే వండర్
ABN , Publish Date - Aug 09 , 2025 | 12:54 AM
కేవలం వందరోజుల్లోనే హంద్రీనీవా వెడల్పు పనులు పూర్తి చేసి, కాలువ సామర్థాన్ని రెట్టింపు చేసినట్లు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. వజ్రకరూరు మండలంలోని రాగులపాడు పంప్‌హౌస్ వద్ద నీటి పంపింగ్‌ను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఎన్ని పంపులు రన చేస్తున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాగులపాడు లిఫ్ట్ నుంచి 8 నుంచి 10 పంపులతో నీటిని ..
హంద్రీనీవా వెడల్పు పనులపై మంత్రి కేశవ్
ఉరవకొండ, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): కేవలం వందరోజుల్లోనే హంద్రీనీవా వెడల్పు పనులు పూర్తి చేసి, కాలువ సామర్థాన్ని రెట్టింపు చేసినట్లు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. వజ్రకరూరు మండలంలోని రాగులపాడు పంప్‌హౌస్ వద్ద నీటి పంపింగ్‌ను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఎన్ని పంపులు రన చేస్తున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాగులపాడు లిఫ్ట్ నుంచి 8 నుంచి 10 పంపులతో నీటిని ఎత్తిపోస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన ఏడాదిలోపే 6 మోటర్ల
నుంచి 12 మోటార్లు వాడుకునేలా కాలువను రెండింతల సామర్థ్యానికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రైతుల నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా పని చేశామన్నారు. 2019కంటే ముందు జగన్మోహనరెడ్డి జలదీక్షకు వచ్చి అధికారంలోకి వచ్చిన నెలల్లోనే పనులు పూర్తి చేస్తామని చెప్పి, తట్టెడు మట్టి కూడా తీయలేదన్నారు. హంద్రీనీవా నీటితో పీఏబీఆర్ డ్యాంను నింపుతామన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో డిస్ర్టిబ్యూటర్ల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ నూతేటి వెంకటేష్, టీడీపీ నాయకులు గోనుగుంట్ల నాగేంద్ర, వలి, వన్నూరుస్వామి, మనోజ్, చాబాల ఎర్రిస్వామి, హెచఎనఎ్‌స ఏఈ సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..