Amaravati Capital Event: అమరావతి పున:ప్రారంభోత్సవం.. ప్రత్యేక ఆకర్షణగా ఐరన్ విగ్రహాలు..
ABN , Publish Date - May 02 , 2025 | 04:13 PM
Amaravati Capital Event: మరికొద్దిసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పున:ప్రారంభ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా మొత్తం 18 ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేయనున్నారు.
అమరావతి రాజధాని పున:ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగుతోంది. రాష్ట్రం నలుమూలలనుంచి ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సైతం భారీగా కార్యక్రమానికి హాజరయ్యారు. మరికొద్దిసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పున:ప్రారంభ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా మొత్తం 18 ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేయనున్నారు.
ప్రత్యేక ఆకర్షణగా ఐరన్ విగ్రహాలు
రాజధాని పున:ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా సభావేదిక వద్ద ఏర్పాటు చేసిన ఐరన్ శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆ విగ్రహాలు చూపరులను ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. బుద్దుడు, కాలచక్రం, సీనియర్ ఎన్టీఆర్, ప్రధాని నరేంద్ర మోదీ విగ్రహాలతో పాటు మేకిన్ ఇండియా లోగోను శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు అద్భుతంగా తీర్చిదిద్దారు. వెంకటేశ్వరరావు వాటిని ఐరన్ స్క్రాప్‌తో వాటిని తయారు చేశారు.
ఇవి కూడా చదవండి
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడి.. ఆ వ్యక్తికి వక్ఫ్ బోర్డ్ బంపర్ ఆఫర్
Gannavaram Airport: గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం.. ఏం జరిగిందంటే