Share News

MP Shabari: వైసీపీ పాలనలో వ్యవసాయ రంగం విధ్వంసం

ABN , Publish Date - Jul 30 , 2025 | 04:59 AM

గత వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యవసాయ రంగం విధ్వంసానికి గురైందని టీడీపీ ఎంపీలు బైరెడ్డి శబరి, కలిశెట్టి అప్పలనాయుడు విమర్శించారు.

MP Shabari: వైసీపీ పాలనలో వ్యవసాయ రంగం విధ్వంసం

  • జగన్‌ హయాంలో వేల కోట్ల బియ్యం స్కాం: ఎంపీలు శబరి, కలిశెట్టి

న్యూఢిల్లీ, జూలై 29(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యవసాయ రంగం విధ్వంసానికి గురైందని టీడీపీ ఎంపీలు బైరెడ్డి శబరి, కలిశెట్టి అప్పలనాయుడు విమర్శించారు. మంగళవారం ఏపీ భవన్‌లో వారు మీడియాతో మాట్లాడారు. ‘టీడీపీ ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఫసల్‌ బీమా యోజన నిధులు రూ.2,500 కోట్లు పెండింగ్‌లో పెట్టిందని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ లోక్‌సభలో చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు రేషన్‌ బియ్యాన్ని ఆఫ్రికా, ఇతరత్రా దేశాలకు అక్రమంగా ఎగుమతి చేసి రూ.వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు. దీనిపై విచారణ జరపాలి’ అని డిమాండ్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

గుడ్ న్యూస్.. రేషన్‌ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏనుగుల గుంపు కదలికలపై వాట్సాప్ ద్వారా హెచ్చరికలు.. పవన్ కల్యాణ్ న్యూ ప్లాన్

Read latest AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 30 , 2025 | 04:59 AM