Share News

Annamayya District: యాసిడ్‌ పోసి.. కత్తితో పొడిచి..

ABN , Publish Date - Feb 15 , 2025 | 03:41 AM

తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో యువతి ము ఖంపై యాసిడ్‌ పోసి.. కత్తితో మెడ, చేతులపై కోశా డు. తీవ్రంగా గాయపడిన ఆ యువతి ప్రాణాపాయ స్థితిలో ఉంది.

Annamayya District: యాసిడ్‌ పోసి.. కత్తితో పొడిచి..

  • ప్రేమించలేదని ప్రేమికుల రోజున యువతిపై ఉన్మాది ఘాతుకం

  • ప్రాణాపాయ స్థితిలో యువతి.. బెంగళూరుకు తరలింపు

  • అన్నమయ్య జిల్లాలో దారుణం

రాయచోటి, అమరావతి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యో తి): ఓ యువకుడు ఉన్మాదిలా మారాడు. తన ప్రేమను అంగీకరించలేదన్న కోపంతో యువతి ము ఖంపై యాసిడ్‌ పోసి.. కత్తితో మెడ, చేతులపై కోశా డు. తీవ్రంగా గాయపడిన ఆ యువతి ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఆమెను మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో శుక్రవారం ఉదయం ఈ దారు ణం చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. గుర్రంకొండ మండలం నడిమిఖండ్రిగ పంచాయితీ ప్యారంపల్లెకు చెందిన టి.జనార్ధన్‌, రెడ్డెమ్మ దంపతుల కుమార్తె గౌతమి (22) మదనపల్లెలో డిగ్రీ పూర్తి చేసి అక్కడే బ్యూటీషియన్‌గా పనిచేసేది. ఈ నేపథ్యంలో అమ్మచెరువు మిట్ట వైఎస్సార్‌ కాలనీకి చెందిన గణేష్‌ అనే యువకుడు ఏడాదిగా బాధితురాలిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ వేధింపులు భరించలేని బాధితురా లు.. 3 నెలలక్రితం స్వగ్రామానికి వచ్చేసింది. తల్లిదండ్రులు మేనత్త కొడుకుతో ఆమెకు ఈ నెల 7న పెళ్లి నిశ్చితార్థం చేశారు. ఏప్రిల్‌ 29న పెళ్లి చేయాల ని నిర్ణయించారు.


విషయం తెలుసుకున్న గణేష్‌ శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో బైక్‌పై ప్యారంపల్లెకు వచ్చి, యువతి తల్లిదండ్రులు లేని సమయంలో గౌతమి ఇంట్లోకి ప్రవేశించి తలుపు మూసేశాడు. తనను ప్రేమించాలని ఆమెను కోరా డు. ఆమె నిరాకరించడంతో తన వెంట బాటిల్‌ లో తెచ్చుకున్న యాసిడ్‌ను ఆమె ముఖం, నోటిలో పోశా డు. తర్వాత.. కత్తితో ఆమె మెడ, చేయిపైన కోసి.. శరీరంపైనా పొడిచాడు. అక్కడి నుంచి పారిపోతూ.. ఆ ఇంటికి తాళం వేశాడు. అయితే ఇంట్లో ఉన్న ఆమె తల్లి ఫోన్‌ నుంచి తండ్రి జనార్ధన్‌కు ఫోన్‌ చేసి ఘటన గురించి చెప్పింది. దీంతో తల్లిదండ్రులు పొలం నుంచి వచ్చేసరికి ఆమె అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే గుర్రంకొండ ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడని సమాచారం. కాగా.. యాసిడ్‌ దాడిని సీఎం చంద్రబాబు ఖండించారు.నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. యాసిడ్‌ దాడి ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. గౌతమికి మెరుగైన వైద్య సాయం అందించి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి:

CRDA: రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లు

Srinivas Verma: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి

Updated Date - Feb 15 , 2025 | 03:41 AM