ABV Case Dropped: ఏబీవీపై కేసు కొట్టివేత
ABN , Publish Date - May 08 , 2025 | 04:15 AM
హైకోర్టు, ఏబీ వెంకటేశ్వరరావుపై నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో నమోదు చేసిన కేసును కొట్టివేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా చేసిన ఆరోపణలు చట్టం ముందు నిలబడలేవని కోర్టు స్పష్టం చేసింది
ఆరోపణలకు ఆధారాల్లేవన్న హైకోర్టు
కామ్‌సైన్ మధుకు 21 వరకు రిమాండ్
అమరావతి, మే 7(ఆంధ్రజ్యోతి): రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు(ఏబీవీ)కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసుతోపాటు విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్‌ను సైతం కొట్టివేసింది. పిటిషనర్‌పై ఏసీబీ మోపిన అభియోగాలు విచారణలో నిలబడవని పేర్కొంది. ఏసీబీ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని, అస్పష్టమైన, నిరాధార ఆరోపణలు చేశారని తెలిపింది. ఈ అభియోగాలు చట్టం ముందు నిలబడవని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పిటిషనర్.. దిగువ కోర్టులో విచారణను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాథ్ బుధవారం తీర్పు ఇచ్చారు. భద్రత, నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి 2021 మార్చిలో ఏసీబీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆపరేషన్ సింధూర్‌పై చిరంజీవి ట్వీట్
ఎమర్జెన్సీ ప్రకటించిన పాకిస్తాన్..
For More AP News and Telugu News