YSRCP MP Mithun Reddy Arrest: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్
ABN , Publish Date - Jul 19 , 2025 | 08:32 PM
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్ అయ్యారు. మిథున్‌రెడ్డికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు. దీనిపై మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన సిట్..
విజయవాడ, జులై 19: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్ అయ్యారు. మిథున్‌రెడ్డికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్‌పై ఎంపీ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చిన సిట్ అధికారులు.. కోర్టుకు హాజరుపరిచే అంశంపై కాసేపట్లో నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్‌రెడ్డి ఏ-4 నిందితుడిగా ఉన్నారు. కాగా, ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు ఇవాళ(శనివారం) మిథున్ రెడ్డిని విచారణకు పిలిచి దాదాపు ఐదు గంటలకు పైగా విచారించారు.
డొల్ల కంపెనీల నుంచి అంతిమ లబ్ధిదారునికి ముడుపులు చేర్చడంపై మిథున్ రెడ్డిని ఎక్కువగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మిథున్‌రెడ్డి విచారణ ఈ కేసులో కీలకంగా భావిస్తున్న పోలీసులు.. లిక్కర్ కేసు ప్రాథమిక చార్జ్‌షీట్లను కోర్టుకు తీసుకెళ్లారు. 300 పేజీలతో కూడిన ఈ చార్జ్‌షీట్‌లో 100కు పైగా RFSL నివేదికలు పొందిపరిచినట్టు సమాచారం. రూ.62 కోట్లు సీజ్ చేసినట్టు సిట్ అధికారులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకూ 268 మంది సాక్షులను సిట్ విచారించినట్లు తెలుస్తోంది.
ఇలా ఉండగా, 2019-2024 మధ్య YSRCP ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.3,200 కోట్ల లిక్కర్ స్కామ్ అక్రమాలకు సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ఎంపీ మిథున్ రెడ్డితో కలిపి ఇప్పటివరకూ 12 మంది అరెస్ట్ చేసింది. వీరిలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (A1), (జగన్ సర్కారులో మాజీ ఐటీ సలహాదారు), ఏప్రిల్ 21, 2025న అరెస్ట్ అవ్వగా.. సజ్జల శ్రీధర్ రెడ్డి (A6), (స్పై ఆగ్రో ఇండస్ట్రీస్ ఎండీ) ఏప్రిల్ 26, 2025న అరెస్ట్ అయ్యారు. ఇక, బి.చాణక్య (A8), పి.దీలీప్ (రాజశేఖర్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు) సైతం అరెస్టు అయ్యారు. అలాగే గోవిందప్ప బాలాజీ (భారతీ సిమెంట్స్ డైరెక్టర్)ను మే 13, 2025న మైసూరులో పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇక, ఈ కేసులో కె.ధనుంజయ రెడ్డి (రిటైర్డ్ IAS అధికారి, మాజీ సీఎంఓ కార్యదర్శి) మే 16, 2025న అరెస్ట్ అయ్యారు. అదే విధంగా పి.కృష్ణమోహన్ రెడ్డి (మాజీ OSD) సైతం అదే రోజు అరెస్ట్ అయ్యారు. ఇలా ఇప్పటికి మొత్తం 12 మందిని జైలుకు పంపించారు.
ఈ కేసులో ఇప్పటివరకూ మొత్తం 33 మందిపై ఆరోపణలు ఉండగా, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వంటి వాళ్లు ఇంకా అరెస్ట్ కాలేదు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నందున త్వరలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
నేను ఎవరికీ భయపడేది లేదు... బండి సంజయ్‌కి స్ట్రాంగ్ కౌంటర్
Read Latest Telangana News and National News