Maski Archaeological Discoveries: మస్కిలో 4వేల ఏళ్లకు పూర్వమే జనావాసాలు!
ABN , Publish Date - Jul 24 , 2025 | 04:08 AM
జిల్లాలోని మస్కి పరిసరాల్లో పురావస్తు పరిశోధకులు జరుపుతున్న తవ్వకాల్లో ప్రాచీన కళాకృతులు..
పురావస్తుశాఖ తవ్వకాల్లో బయటపడ్డ ప్రాచీన కళాకృతులు
రాయచూరు, జూలై 23(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మస్కి పరిసరాల్లో పురావస్తు పరిశోధకులు జరుపుతున్న తవ్వకాల్లో ప్రాచీన కళాకృతులు, పురాతన ఆయుధాలు బయటపడ్డాయి. భారత్‌తోపాటు అమెరికా, కెనడా దేశాల నుంచి వచ్చిన పలువురు పరిశోధకులు ఈ తవ్వకాల్లో పాల్గొంటున్నారు. గతంలోనే ఈ ప్రాంతంలో మౌర్య సామ్రాజ్య చక్రవర్తి అశోకుడి కాలానికి చెందిన శాసనాలను గుర్తించారు. ఇటీవల జరిపిన తవ్వకాల్లో వేల ఏళ్ల క్రితం.. అప్పటి ప్రజలు వినియోగించిన వంట సామగ్రి, రాతి ఆయుధాలు, మట్టిపెంకులు, వివిధ కళాకృతులు లభించాయని తవ్వకాలకు నేతృత్వం వహిస్తున్న ఢిల్లీకి చెందిన నిపుణుడు శివ్ నాడార్ తెలిపారు. మస్కి సమీపంలో తవ్వకాల కోసం 271 కేంద్రాలను గుర్తించామన్నారు. మల్లికార్జున బెట్ట, దేవాలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో క్రీస్తు పూర్వం 14 నుంచి 11వ శతాబ్దాల మధ్య అప్పటి జనావాసాలు సైతం ఉన్నాయని గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మస్కి పరిసరాల్లో సాగుతున్న తవ్వకాల్లో దాదాపు 4 వేల సంవత్సరాలకు పూర్వమే జనావాసాలున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
దోసకాయను ఉప్పుతో తింటున్నారా? ఈ ముఖ్య విషయం తెలుసుకోండి.!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!