Share News

AP ICET 2025 Applications: ఏపీ ఐసెట్‌కు 35000 దరఖాస్తులు

ABN , Publish Date - Apr 10 , 2025 | 04:19 AM

ఏపీ ఐసెట్ 2025కు 35,000 దరఖాస్తులు అందినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ ఎం. శశి ప్రకటించారు. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత అధిక రుసుములతో దరఖాస్తు చేయడానికి అవకాశం ఉందని చెప్పారు

AP ICET 2025 Applications: ఏపీ ఐసెట్‌కు 35000 దరఖాస్తులు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే ఏపీ ఐసెట్‌-2025కు దరఖాస్తు గడువు బుధవారంతో ముగిసిందని కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఎం.శశి తెలిపారు. ఇప్పటివరకూ 35 వేల దరఖాస్తులు వచ్చినట్టు ఆమె ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రూ.1000 అపరాధ రుసుముతో ఈ నెల 14వరకు, రూ.2 వేలతో 19 వరకు, రూ.4 వేలతో 24 వరకు, రూ.10 వేల అపరాధ రుసుముతో 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. మే రెండో తేదీ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని, ఏడో తేదీన రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష జరుగుతుందని వెల్లడించారు.


Read Latest AP News And Telugu News

Updated Date - Apr 10 , 2025 | 04:20 AM