Share News

Totapuri Mango Support Price: తోతాపురి రైతులకు నిధులు మంజూరు

ABN , Publish Date - Jul 18 , 2025 | 04:38 AM

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రస్తుత సీజన్‌లో 6.50 లక్షల టన్నుల తోతాపురి మామిడి రైతులకు మద్దతు ధర కింద కిలోకు..

Totapuri Mango Support Price: తోతాపురి రైతులకు నిధులు మంజూరు
Totapuri Mango Support Price

అమరావతి, జూలై 17(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రస్తుత సీజన్‌లో 6.50 లక్షల టన్నుల తోతాపురి మామిడి రైతులకు మద్దతు ధర కింద కిలోకు రూ.4చెల్లించేందుకు ప్రభుత్వం ఉద్యానశాఖ డైరెక్టర్‌కు అనుమతి ఇచ్చింది. ఈమేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మద్దతు ధర కోసం ప్రభుత్వం కిలోకు రూ.4చొప్పున రూ.260కోట్లు ఖర్చు చేయనున్నది. ఈ నిధులను స్వల్పకాలిక రుణాల ద్వారా సమీకరించాలని ఉద్యానశాఖ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటివరకు 4.26 లక్షల టన్నులపైగా తోతాపురిని ప్రొసెసింగ్‌ యూనిట్లు, వ్యాపారులు కొనుగోలు చేశారు. కాగా రసాయన ఎరువుల వినియోగం తగ్గించడం, సేంద్రియ ఎరువుల వాడకం పెంచడంపై రైతులకు అవగాహన కల్పించే పోస్టర్‌ను వ్యవసాయశాఖ డైరెక్టర్‌ డిల్లీరావు గురువారం విడుదల చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..

Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..

CM Vs KTR: కేటీఆర్ మిత్రుడు దుబాయ్‌లో చనిపోయాడు: సీఎం రేవంత్

Updated Date - Jul 18 , 2025 | 04:38 AM