Accident Insurance Policy: రోజుకు రూ. 2 రూపాయలతో రూ. 15 లక్షలు, తపాలా శాఖ కొత్త పాలసీ
ABN , Publish Date - Aug 16 , 2025 | 09:11 AM
ప్రమాద బీమా పేద, మధ్య తరగతి ప్రజలకు అత్యవసరమే. ప్రమాదాలు జరిగినప్పుడు బీమా సొమ్ము ఆ కుటుంబానికి ఎంతో ఆసరానిస్తుంది. ఇందుకోసం పోస్టల్ డిపార్ట్ మెంట్ ఒక పాలసీ తీసుకొచ్చింది. రోజుకు రెండు రూపాయలు కడతే, పదిహేను లక్షలకు..
ప్రమాద బీమా పేద, మధ్య తరగతి ప్రజలకు అత్యవసరమే. అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు బీమా సొమ్ము ఆ కుటుంబానికి ఎంతో ఆసరానిస్తుంది. ఇందుకోసం పోస్టల్ డిపార్ట్ మెంట్ ఒక పాలసీ తీసుకొచ్చింది. రోజుకు రెండు రూపాయలు కడతే, పదిహేను లక్షలకు బీమా సౌకర్యం కల్పిస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆదిత్య బిర్లా క్యాపిటల్ సంస్థతో కలిసి తపాలా శాఖ సంయుక్తంగా ఈ ప్రమాద బీమా పాలసీలు అందుబాటులోకి తెచ్చింది.
అర్హతలు :
బీమా పాలసీని 18నుంచి 65 సంవత్సరాల వయసు గల వారు ఎవరైనా తీసుకోవచ్చు
పాలసీ తీసుకోడానికి దగ్గరలోని తపాలా కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది
ఆధార్ కార్డు, దానితో లింక్ అయిన ఫోన్ నంబరు ఉండాలి
కొందరికి వైద్య పరీక్షలు చేసిన తరవాత పాలసీ ఇస్తారు
సాయుధ బలగాలకు ఈ పాలసీ వర్తించదు
చెల్లించాల్సిన ప్రీమియం :
రోజుకు రూ.1.50తో రూ.10లక్షలు, రూ.2లతో రూ.15లక్షలు విలువైన బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి
ఏడాదికి రూ.549 ప్రీమియంతో అకాల మరణాలకు రూ.10లక్షలు, రూ.749 ప్రీమియంతో రూ.15లక్షల పాలసీలు అందుబాటులో ఉన్నాయి
బీమా కవరేజ్ :
ప్రమాదం కారణంగా శాశ్వత వైకల్యానికి పూర్తి బీమా సొమ్ము చెల్లిస్తారు
అంగవైకల్యం కాని, పక్షవాతం వచ్చినా పూర్తి బీమా లభిస్తుంది.
ప్రమాదవశాత్తు వైద్య ఖర్చులు ఒ.పి.డి రూ.30 వేలు, లేదా ప్రమాదం జరిగినప్పుడు ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేకపోతే 10సార్లు రూ.1500 విలువైన కన్సల్టేషన్లు వర్తిస్తాయి
ప్రమాదం జరిగి ఆసుపత్రిలో ఉంటే రూ.60 వేల వరకు చెల్లిస్తారు
ఇద్దరు పిల్లలకు విద్యా ప్రయోజనం కింద గరిష్ఠంగా రూ.లక్ష వరకు లభిస్తుంది.. ఒకవేళ ఫీజులు తక్కువగా ఉంటే వాటినే చెల్లిస్తారు
ప్రమాదం జరిగి వ్యక్తి కోమాలోకి వెళ్తే రూ.లక్ష వరకు బీమా కవర్ ఉంటుంది
ఎముకలు విరిగితే దాని ఖర్చుల నిమిత్తం రూ.లక్ష వరకు వస్తుంది
తలకు ఏదైనా దెబ్బ తగిలి మానసికంగా ఇబ్బంది పడితే నాలుగు కన్సల్టెంట్‌లు ఉచితం
ఒకరికి ప్రమాదం జరిగి వేరేచోట మరణించి ఉంటే వారి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి రావడానికి రూ.25 వేల వరకు చెల్లిస్తారు
ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులకు భరోసాగా రూ.5 వేల వరకు వస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మరింతగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News