YS Sharmila : సరస్వతీ పవర్ షేర్ల బదిలీపై ట్రైబ్యునల్‌లో విచారణ
ABN , Publish Date - Mar 07 , 2025 | 07:16 AM
సరస్వతీ పవర్‌కు సంబంధించిన షేర్ల బదిలీని అడ్డుకోవాలని కోరుతూ ఏపీ మాజీ సీఎం జగన్, ఆయన భార్య భారతి దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్‌లో విచారణ జరిగింది.

ప్రతివాదిగా తన పేరు తొలగించాలని షర్మిల వినతి
హైదరాబాద్, మార్చి 6(ఆంధ్రజ్యోతి): సరస్వతీ పవర్‌కు సంబంధించిన షేర్ల బదిలీని అడ్డుకోవాలని కోరుతూ ఏపీ మాజీ సీఎం జగన్, ఆయన భార్య భారతి దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్‌లో విచారణ జరిగింది. జగన్, భారతిల తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ప్రతివాదులైన వైఎస్ విజయలక్ష్మి, షర్మిల తరఫున సీనియర్ న్యాయవాది వివేక్‌రెడ్డి, విశ్వరాజ్ హాజరయ్యారు.
ఈ కేసుతో తనకు సంబంధం లేదని, ఆస్తుల పంపకాలకు కంపెనీ పిటిషన్‌కు సంబంధం లేదని షర్మిల విన్నవించారు. తనను ప్రతివాదిగా తొలగించాలని కోరారు. దీనిపై సమాధానాలు ఇవ్వాలని సంబంధిత పార్టీలకు బెంచ్ నోటీసులు జారీచేసింది. ప్రధాన పిటిషన్‌పై వాదనలు వినాలని నిరంజన్‌రెడ్డి కోరగా, బెంచ్ అంగీకరించలేదు. మధ్యంతర దరఖాస్తులపై ఉత్తరప్రత్యుత్తరాలు పూర్తయ్యాక అన్నీ కలిపి వింటామని పేర్కొంది. తదుపరి విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది.
ఈ వార్తను కూడా చదవండి:
కొలంబియా అమ్మాయి.. తెలంగాణ అబ్బాయి
Srisailam Dam: ముప్పు ముంగిట శ్రీశైలం!