Telangana: శ్రీతేజ్‌కు అండగా మంత్రి కోమటిరెడ్డి.. రూ. 25 లక్షలు సాయం..
ABN, Publish Date - Dec 21 , 2024 | 05:48 PM
పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కీసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్‌కు మంత్రి కోమటిరెడ్డి అండగా నిలిచారు.
హైదరాబాద్, డిసెంబర్ 21: పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కీసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్‌కు మంత్రి కోమటిరెడ్డి అండగా నిలిచారు. శనివారం నాడు కిమ్స్ ఆస్పత్రి వద్దకు వెళ్లిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. వారి కుటుంబాన్ని పరామర్శించారు. తన కొడుకు ప్రతీక్ ఫౌండేషన్ పేరు మీద రూ. 25 లక్షల చెక్కును శ్రీతేజ్ కుటుంబానికి అందజేయనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు. ఈ చెక్కును శ్రీతేజ్ తండ్రికి అందజేయనున్నట్లు తెలిపారు. ఇదిలాఉంటే.. శ్రీతేజ్ వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని అసెంబ్లీ వేదికగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు.
Updated at - Dec 25 , 2024 | 02:49 PM