Miss Vizag Nakshatra: తేజ చాలా మంది అమ్మాయిలను వాడుకొని వదిలేశాడు

ABN , First Publish Date - 2024-05-31T14:00:25+05:30 IST

భర్త తేజపై మిస్ వైజాగ్ నక్షత్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనకు విడాకులు ఇవ్వకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నాడని ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో వివరించారు. వారిద్దరూ కలిసి ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టిచ్చానని తెలిపారు.

Miss Vizag Nakshatra: తేజ చాలా మంది అమ్మాయిలను వాడుకొని వదిలేశాడు
Miss Vizag Nakshatra

భర్త తేజపై మిస్ వైజాగ్ నక్షత్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనకు విడాకులు ఇవ్వకుండానే మరొ యువతని పెళ్లి చేసుకున్నాడని మండిపడ్డారు. వంశీ ధర్మజ్ఞ అలియాస్ సారాను పెళ్లి చేసుకున్నాడని తెలిసి షాకయ్యానని ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో వివరించారు. వారిద్దరూ కలిసి ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టిచ్చానని తెలిపారు. సారాకు రాజకీయ పలుకుబడి ఉండటంతో ఆమెను పోలీసులు వదిలేశారని వివరించారు. తనకు జరిగిన అన్యాయం గురించి నక్షత్ర వెల్లడించారు. సారాను పోలీసులు ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు.


2021లో భర్త తేజ గురించి తనకు పూర్తిగా తెలిసిందన్నారు. అతని మొబైల్ చూడగా ఎఫైర్స్, ఫొటోలు, మెసేజ్ బయటపడ్డాయని నక్షత్ర వివరించారు. అతని గురించి మరొకరిని కనుక్కోగా అతను ఉమెనైజర్ అని తెలిసి ఆశ్చర్య పోయానని బాధ పడ్డారు. డేటింగ్ యాప్స్ ఉపయోగించి అమ్మాయిలను వాడుకొని వదిలేసే వాడని గుర్తుచేశారు. ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తెలిసి వారు ఉన్న ఇంటికి వెళ్లానని ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో చెప్పారు. అసలు ఏం జరిగిందో నక్షత్ర పూస గుచ్చినట్టు వివరించారు. ఆ ఇంటర్వ్యూ చుద్దాం. పదండి.

Updated Date - 2024-05-31T14:46:36+05:30 IST