పవన్ కల్యాణ్‌పై రోజా కామెంట్స్..

ABN, Publish Date - Oct 21 , 2024 | 01:05 PM

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళల రక్షణ తన బాధ్యత అని .. తనను నమ్మి ఓటేయాలని ఎన్నికల ముందు ప్రజలకు చెప్పిన పవన్.. ఇవాళ రాష్ట్రంలో ఇంతమంది మహిళలకు అన్యాయం జరుగుతుంటే.. కళ్లకు కనిపించడం లేదా.. అని ప్రశ్నించారు.

అమరావతి: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళల రక్షణ తన బాధ్యత అని .. తనను నమ్మి ఓటేయాలని ఎన్నికల ముందు ప్రజలకు చెప్పిన పవన్.. ఇవాళ రాష్ట్రంలో ఇంతమంది మహిళలకు అన్యాయం జరుగుతుంటే.. కళ్లకు కనిపించడం లేదా.. అని ప్రశ్నించారు. ‘‘షూటింగ్‌లో అంత బిజీగా ఉన్నారా.. పవన్ కల్యాణ్ గారూ.. అందుకేనే ప్రజలు మీకు ఓట్లు వేసింది.. మిమ్మల్ని నమ్ముకున్న ఆడవాళ్లకు మీరు చేసే న్యాయం ఇదేనా అని’’ రోజా నిలదీశారు.


అలాగే ఎక్కడైనా బెల్టు, వైన్ షాపులు మహిళలకు నచ్చని చోట పెడితే.. వాళ్ల అంతు చూస్తానని పవన్ చెప్పారని.. మరి ఈ రోజున గుడి, బడి అనే తేడా లేకుండా ఎక్కడ బడితే అక్కడ వైన్ షాపులు పెట్టుకోమని కేబినెట్‌లో చెబుతున్నారని రోజా విమర్శించారు. వీటిపై మహిళలు ధర్నాలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ఎన్నికల ముందు చెప్పిన మాటలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పాటించాల్సిన బాధ్యత లేదా అని పవన్ కల్యాణ్‌ను రోజా ప్రశ్నించారు..


ఈ వార్తలు కూడా చదవండి..

తిరుమల కొండపై హెలికాప్టర్ కలకలం

మాజీ మంత్రి విశ్వరూప్ కొడుకు అరెస్ట్..

పోలీసు అమరవీరులకు అమిత్ షా నివాళులు..

రౌడీలకు సీఎం చంద్రబాబు వార్నింగ్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Oct 21 , 2024 | 01:05 PM