కర్నూలు: టెన్షన్‌‌లో వైసీపీ అభ్యర్థులు..

ABN, Publish Date - May 22 , 2024 | 09:33 AM

కర్నూలు జిల్లా: వైసీపీ నేతల్లో అంతర్‌మథనం మొదలైంది. సీఎం జగన్ టిక్కెట్లు ఇవ్వగానే కొత్తగా పోటీ చేసిన అభ్యర్థులు గెలుపు తమదేనని భావించారు. భారీగా నమోదైన పోలింగ్ సరళిని పరిశీలించిన తర్వాత వారి గుండెల్లో గుబులు పుడుతుందనే టాక్ ఉంది.

కర్నూలు జిల్లా: వైసీపీ నేతల్లో అంతర్‌మథనం మొదలైంది. సీఎం జగన్ టిక్కెట్లు ఇవ్వగానే కొత్తగా పోటీ చేసిన అభ్యర్థులు గెలుపు తమదేనని భావించారు. భారీగా నమోదైన పోలింగ్ సరళిని పరిశీలించిన తర్వాత వారి గుండెల్లో గుబులు పుడుతుందనే టాక్ ఉంది. కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా నగర మేయర్ రామయ్య, అసెంబ్లీ అభ్యర్థిగా ఇంతియాజ్ అహ్మద్ పోటీ చేశారు. కోడుమూరు నుంచి ఆదిమూలపు సతీష్, ఆలూరులో విరూపాక్షి, ఎమ్మిగనూరులో భుట్టా రేణుక, నంది కొట్కూరు నుంచి సుధీర్ పోటీ చేశారు. నామినేషన్ల దాఖల సమయంలో వార్ వన్‌సైడేనని, ప్రజల మద్దతు తమకే ఉందని వైసీపీ అభ్యర్థులు చెప్పేవారు. అయితే ఎన్డీయే కూటమి అభ్యర్థులకే ఉద్యోగులు ఓట్లు వేశారనే ప్రచారం పొలిటికల్ సర్కిల్‌లో చక్కెర్లు కొడుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

అమిత్ సా వ్యాఖ్యాలపై కేజ్రీవాల్ ఆగ్రహం..

బెంగళూరు రేవ్ పార్టీలో కీలక సూత్రధారి ఎవరంటే..

జగన్‌ సర్కార్‌ మరో కుట్ర

పిన్నెల్లి అరాచకం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 22 , 2024 | 09:34 AM