సీఎంకు ముద్దు పెట్టబోయిన మహిళా అభిమాని

ABN, Publish Date - Nov 03 , 2024 | 01:38 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జడ్ ప్లస్ భద్రతలో ఉండే చంద్రబాబు దగ్గరకు వెళ్లడమంటే మామూలు విషయమా.. కానీ ఓ మహిళా అభిమాని మాత్రం ఎలాగైనా తమ అభిమాన నేత చంద్రబాబును కలవాలనుకుని సంకల్పించుకుంది.

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఓ మహిళా అభిమాని తన అభిమానాన్ని చాటుకున్నారు. ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడంతోపాటు సామాజిక పెన్షన్ రూ. 4 వేలకు పెంచడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన మహిళ.. చంద్రబాబును ముడ్డుపెట్టుకునేందుకు ప్రయత్నించింది. అయితే సీఎం సున్నితంగా తిరస్కరించారు. పరవాడ పర్యటన ముగించుకుని తిరిగి వెళుతున్న సమయంలో సెక్యూరిటీని దాటుకుని వచ్చిన మహిళ బొకే అందించారు. చంద్రబాబుకు ముద్దుపెట్టేందుకు పలుమార్లు ప్రయత్నించారు.


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జడ్ ప్లస్ భద్రతలో ఉండే చంద్రబాబు దగ్గరకు వెళ్లడమంటే మామూలు విషయమా.. కానీ ఓ మహిళా అభిమాని మాత్రం ఎలాగైనా తమ అభిమాన నేత చంద్రబాబును కలవాలనుకుని సంకల్పించుకుంది. ఇంకేముంది అనకాపల్లి పర్యటనకు వచ్చిన చంద్రబాబును కలిసేందుకు చుట్టూ ఉన్న భద్రతా వలయాన్ని తప్పించుకుని వచ్చారు. ఆమె అభిమానాన్ని చూసి చంద్రబాబు కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. సీఎం భద్రతా సిబ్బంది మహిళను వారించే ప్రయత్నం చేసినా, చంద్రబాబు మాత్రం ఆ మహిళను దగ్గరకు తీసుకుని.. అప్యాయంగా పలకరించారు. తమ అభిమాన నేతకు పుష్ఫగుచ్చాన్ని అందించింది. అక్కడితే ఆగలేదు. రాకరాక చంద్రబాబును కలిసే అవకాశం రావడంతో.. తమ అభిమాన నేతపై ఎంత ప్రేమ ఉందో చూపించే ప్రయత్నం చేసింది. చంద్రబాబును పట్టుకుని ఆయనకు ముద్దు పెట్టే ప్రయత్నం చేసింది. సీఎం ఆమెను ఏమి అనకపోయినా.. భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని మహిళను భద్రతా సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత గత పాలకులది

గ్రేటర్‌లో రికార్డు స్థాయిలో ఎయిర్ పొల్యూషన్

కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఏనుగుల గుంపు

మతిస్థిమితం లేని మహిళపై దారుణం..

గోవా నుంచి కలకత్తా వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Nov 03 , 2024 | 01:38 PM