నా భర్త కావాలి.. భార్య పోరాటం..
ABN, Publish Date - Nov 26 , 2024 | 01:13 PM
గుంటూరు జిల్లా, ఆరమండకు చెందిన మొగల బాబుతో.. కట్టెంపూడికి చెందిన మౌళికకు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఎంబీఏ వరకు చదువుకున్న ఆమె.. ఆస్ట్రేలియాలో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసి విఫలమైంది. దీంతో భర్త, అత్త, ఆడపడుచు కలిసి ఆమెను వేధింపులకు గురిచేసి.. మూడు నెలల క్రితం పుట్టింటికి పంపించేశారు.
గుంటూరు జిల్లా: ఆరమండి గ్రామంలో భర్త ఇంటి ముందు భార్య న్యాయపోరాటానికి దిగింది. విదేశాల్లో ఉద్యోగం సంపాదించడంలో విఫలమైందని భార్యను పుట్టింట్లో వదిలేసి రెండో పెళ్లికి ప్రయత్నాలు చేస్తున్న భర్త ఇంటి ముందు భార్య బైటాయించింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా, ఆరమండకు చెందిన మొగల బాబుతో.. కట్టెంపూడికి చెందిన మౌళికకు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఎంబీఏ వరకు చదువుకున్న ఆమె.. ఆస్ట్రేలియాలో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసి విఫలమైంది. దీంతో భర్త, అత్త, ఆడపడుచు కలిసి ఆమెను వేధింపులకు గురిచేసి.. మూడు నెలల క్రితం పుట్టింటికి పంపించేశారు.
అంతటితో ఆగకుండా మొగలా బాబు తల్లి విజయలక్ష్మి కొడుక్కి రెండో పెళ్లి చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమాచారం తెలుసుకున్న మౌళిక తమ బంధువులతో కలిసి అత్తవారి ఇంటి ముందు ఆందోళనకు దిగింది. తనకు భర్త కావాలని, అత్తింట్లో జీవించే విధంగా న్యాయం చేయాలని బాధితురాలు కోరుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
దెబ్బతిన్న హైదరాబాదీ బిర్యానీ బ్రాండ్ ఇమేజ్..
పర్యాటక రంగంలో 7 ప్రాజెక్టులపై ప్రతిపాదనలు
ఢిల్లీలో పవన్ కల్యాణ్ బిజీ బిజీ..
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కేసు నమోదు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Nov 26 , 2024 | 01:13 PM