ఇంత చిన్న లాజిక్కిని జగన్ ఎలా మిస్ అయ్యారు?

ABN, Publish Date - Aug 01 , 2024 | 08:00 AM

విశాఖ: నిన్న, మొన్నటి వరకు జగన్ అంత నాయకుడు జగత్‌లోనే లేరన్నారు.. నేటి రాజకీయాల్లో మా నాయకుడే మొనగాడని కీర్తించారు. కానీ ఇప్పుడేమో ఆయనతోనే తంటా అని వైజాగ్ వైసీపీ నేతలు అంటున్నారు. ఢిల్లీలో జగన్ ధర్నా తర్వాత విశాఖలో పార్టీ నేతల స్వరం ఎందుకు మారింది?

విశాఖ: నిన్న, మొన్నటి వరకు జగన్ అంత నాయకుడు జగత్‌లోనే లేరన్నారు.. నేటి రాజకీయాల్లో మా నాయకుడే మొనగాడని కీర్తించారు. కానీ ఇప్పుడేమో ఆయనతోనే తంటా అని వైజాగ్ వైసీపీ నేతలు అంటున్నారు. ఢిల్లీలో జగన్ ధర్నా తర్వాత విశాఖలో పార్టీ నేతల స్వరం ఎందుకు మారింది? అధినేత తీరును తప్పు పట్టే పరిస్థితి ఎందుకొచ్చింది?.. పవర్‌లో ఉండగా రాంగ్ సలహాలు ఇచ్చిన అడ్వయిజర్లు ఇప్పుడు కూడా మారలేదా?.. ఏపీలో శాంతి, భద్రతలు క్షీణించాయని.. 45 రోజుల్లో మూడు పదుల మందికి పైగా వైసీపీ నేతలు, కార్యకర్తల హత్యలు జరిగాయని నానా యాగి చేయడాన్ని సొంత పార్టీ నేతలే తప్పుపడుతున్నారు.


ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్రంలో కొలువుతీరిన ఎన్డీయే సర్కార్‌కు కొంత సమయం కూడా ఇవ్వకుండా ఢిల్లీలో ధర్నా చేయడంపై వైసీపీ నుంచి విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. ఇందు కోసం ఎంచుకున్న సమయం, సందర్భం సరియైనది కాదని బాహాటంగానే అంటున్నారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి పట్టుమని 50 రోజులు కూడా నిండకుండా ధర్నా చేయడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్ళాయని మదన పడుతున్నారు. పైగా నిజంగా రాజకీయ హత్యలు జరిగి ఉంటే ప్రభుత్వాన్ని అసెంబ్లీలో గట్టిగా నిలదీయాలి. పైగా ధర్నా చేసే సమయానికి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.. ఈ సమావేశాలను ఎగ్గొట్టి మరి ధర్నా చేయడాన్ని ప్రజల ఎవరూ సమర్థించడం లేదని వాపోతున్నారు.. ఇంత చిన్న లాజిక్కిని మా అధినేత ఎందుకు మిస్ అయ్యారు అబ్బా? అంటూ ప్రశ్నిస్తున్నారు. హత్యకు గురైన వారి అందరి పేర్లు, అడ్రాసులు, వివరాలను జాతీయ మీడియా అడిగితే జగన్ తప్పించుకొని మొహం చాటు వేయడం పార్టీ పరువును బజారున పడేసిందని వాపోతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

యూపీ సీఎం యోగి సంచలన నిర్ణయం..

ఎక్కడ చూసినా విషాదమే

భీమిలి బీచ్‌ భూములపై విజయసాయి పంజా

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Aug 01 , 2024 | 08:00 AM