3 ఏళ్లు ముప్పుతిప్పలు.. అవినాష్ బాగోతం బయటపెట్టిన బాధితులు

ABN, Publish Date - Nov 30 , 2024 | 09:47 PM

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరుల నుంచి తన కార్లు ఇప్పించినందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడుకి యజమాని సతీష్ ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం కారణంగానే తనకు కార్లు వచ్చాయని చెప్పారు. గత మూడేళ్లుగా తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని చెప్పారు. హత్య చేసేందుకు ప్రయత్నం చేశారని చెప్పారు.

సంగారెడ్డికి చెందిన సతీష్‌కు ఆరు కార్లు ఉన్నాయి. వాటిని వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరులు తీసుకున్నారు. వాటిని ఏపీ, తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకుని ఈ రోజు.. అంటే డిసెంబర్ 30వ తేదీన సతీష్‌కు అందజేశారు. అలాగే ఆ కార్లను సంగారెడ్డికి తీసుకు వచ్చారు. కూటమి ప్రభుత్వంలోని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ వల్లే తన కార్లు తనకు వచ్చాయని తెలిపారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు చెప్పారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Nov 30 , 2024 | 09:47 PM