మేడారం అడవుల్లో టోర్నడోలు..

ABN, Publish Date - Sep 11 , 2024 | 09:30 PM

మేడారం(Medaram) అడవుల్లో అలజడి. గాలులు సుడులు తిరిగాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా లక్ష వృక్షాలను గాలులు పెకిలించాయి. ఈ గాలులను ఆంధ్రజ్యోతి కెమెరామెన్ క్లిక్ మనిపించారు.

ములుగు: మేడారం(Medaram) అడవుల్లో అలజడి. గాలులు సుడులు తిరిగాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా లక్ష వృక్షాలను గాలులు పెకిలించాయి. ఈ గాలులను ఆంధ్రజ్యోతి కెమెరామెన్ క్లిక్ మనిపించారు. అమెరికాలో వచ్చిన తరహాలో టోర్నడోలు(Tornadoes) మెుత్తం అడవిని క్షణాల్లోనే నాశనం చేశాయి. గాలులకు చెట్లు నేలకొరిగాయి. గంటకు 120కి.మీ.లకు పైగా వేగంగా వచ్చిన సుడిగాలులు 500ఎకరాల అడవిని పెకిలించి పడేశాయి. ఇవే గాలులు పట్టణంలో వచ్చి ఉంటే వేలాది ఇళ్లు పైకి లేచేవి. ఆస్తి, ప్రాణ నష్టం భారీగా ఉండేది. మేడారం అడవుల్లోని ఈ వైపరీత్యంపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటార్(NRSC) అధికారుల బృందం విచారణ చేపట్టింది. 2018 జనవరి 22న కూడా మేడారం చిలకలగుట్టలో ఇలాంటి టోర్నడోనే వచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి..

హైడ్రా కూల్చివేతల్లో ఉపయోగించే భారీ యంత్రం ఇదే..

గోదావరి మహోగ్రరూపం.. రెండో ప్రమాద హెచ్చరిక..

అందుకే తేజస్వీతో సీఎం నితీశ్ భేటీ...

ఉచిత ఇసుక..నేటి నుండే పోర్టల్ ప్రారంభం..

రచ్చరేపుతున్న రెడ్‌బుక్ రాజకీయాలు..

Read LatestAP NewsandTelugu News

Read LatestTelangana NewsandNational News

Read LatestChitrajyothy NewsandSports News

Updated at - Sep 11 , 2024 | 09:36 PM