ఇకపై అగ్గువకే ఆ చేప.. ఎందుకంటే..

ABN, Publish Date - Nov 28 , 2024 | 12:55 PM

తెలంగాణ రాష్ట్ర చేప కొనమీను పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపట్టడంతోపాటు.. వినియోగాన్ని పెంచేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రాజెక్టును చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మంచిర్యాల జిల్లా, ఎల్లంపల్లి జలాశయం వద్ద 30 ఎకరాలలో కొరమీను చేపల సంవరక్షణ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది.

హైదరాబాద్: అది పౌష్టిక ఆహారం.. అది ఆరోగ్య ప్రదాయిని.. దాని కోసం జనం పరితపించిపోతుంటారు.. తిన్నా మైరమచిపోతుంటారు. ప్రభుత్వాలు కూడా వాటి ఉత్పత్తులను పెంచేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఎంత ఖర్చుకైనా వెనకాడకూడదని భావిస్తుంటాయి... అవే కొరమీను.. తెలంగాణ అధికారిక చేప కొరమట్టలకు మంచి రోజులు రాబోతున్నాయి. మంచిర్యాల జిల్లా, ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద కొరమీను చేపల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్థానిక ఎమ్మెల్యే ప్రేమసారరావు చొరవతో ఈ కొత్త ప్రాజెక్టు చేపట్టబోతున్నారు. దీని వల్ల వందలమంది మత్స్యకారులకు ప్రత్యక్షంగా.. వేలాది మంది వ్యాపారులకు పరోక్షంగా ఉపాధి లభించనుంది.


తెలంగాణ రాష్ట్ర చేప కొరమీను పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపట్టడంతోపాటు.. వినియోగాన్ని పెంచేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రాజెక్టును చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మంచిర్యాల జిల్లా, ఎల్లంపల్లి జలాశయం వద్ద 30 ఎకరాలలో కొరమీను చేపల సంవరక్షణ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోనే తొలిసారి జాతీయ వ్యవసాయ పరిశోధన మండలికి చెందిన మంచినీటి చేపల పెంపకం సంస్థ (సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వా కల్చర్) అందించే సాంకేతిక సహకారంతో దీనిని స్థాపించనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ ఇద్దరి మధ్య కొలిక్కి రాని చర్చలు

ఇంకా అజ్ఞానంలోనే రాంగోపాల్ వర్మ..

పిఠాపురానికి చెందిన మరో కార్మికుడు మృతి

ఒక రోజు ముందుగానే సామాజిక పింఛన్ల పంపిణీ

దేనికి విజయోత్సవాలు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్...

జీజీహెచ్‌లో వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Nov 28 , 2024 | 12:55 PM