వరద నష్టాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తా: కేంద్రమంత్రి శివరాజ్
ABN, Publish Date - Sep 07 , 2024 | 09:59 AM
వర్షాలు, వరదలతో నష్టపోయిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అండగా ఉంటుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్(Shivraj Singh Chouhan) హామీ ఇచ్చారు. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని, రైతులు ధైర్యంగా ఉండాలన్నారు.
హైదరాబాద్: వర్షాలు, వరదలతో నష్టపోయిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అండగా ఉంటుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్(Shivraj Singh Chouhan) హామీ ఇచ్చారు. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని, రైతులు ధైర్యంగా ఉండాలన్నారు. కేంద్ర మంత్రులు చౌహాన్, బండి సంజయ్, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి వరద బాధిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. మధిర, ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో జరిగిన నష్టాన్ని చూశారు.
ఏరియల్ సర్వే తర్వాత హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డితో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వల్ల వాటిల్లిన వరద నష్టం తీవ్రతను సీఎం రేవంత్.. శివరాజ్‌కు వివరించారు. ఖమ్మం, మహబూబ్‌నగర్, సూర్యాపేటతోపాటు పలు జిల్లాలో ఒకే రోజు అత్యధికంగా 40సె.మీ. వర్షం కురిసిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణనష్టం తప్పిందన్నారు. కానీ వరద నష్టం తీవ్రంగా ఉందని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని దృశ్యాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా కేంద్ర మంత్రులకు చూపించారు.
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Sep 07 , 2024 | 10:00 AM