జగన్‌కు మరో షాక్.. ఇసుక తవ్వకాలు నిజమే..
ABN, Publish Date - Jun 27 , 2024 | 08:17 AM
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మే 16 వరకూ అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిగాయి. ప్రతిమ ఇన్‌ఫ్రా, జీసీకేసీ కంపెనీలు ఎలాంటి అనుమతులూ తీసుకోకుండానే తవ్వకాలు సాగించాయి’ అని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ శాస్త్రవేత్తల బృందం సుప్రీంకోర్టుకు నివేదించింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మే 16 వరకూ అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిగాయి. ప్రతిమ ఇన్‌ఫ్రా, జీసీకేసీ కంపెనీలు ఎలాంటి అనుమతులూ తీసుకోకుండానే తవ్వకాలు సాగించాయి’ అని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ శాస్త్రవేత్తల బృందం సుప్రీంకోర్టుకు నివేదించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన తర్వాత మే 14 నుంచి 16 వరకూ ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరితో పాటు పలు జిల్లాల్లోని ఇసుక రీచ్‌లు, స్టాక్‌యార్డ్‌లను ఈ బృందం తనిఖీ చేసి అదే నెల 18న నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో అనేక సంచలన అంశాలు ఉన్నాయి. ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలా.. అలాంటిదేమీ లేదే? తవ్వకాలు జరిపిన ఆనవాళ్లే లేవంటూ ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గనుల శాఖ, అటు 23 జిల్లాల కలెక్టర్లు తొలుత ఎన్జీటీకి, ఆ తర్వాత హైకోర్టుకు నివేదికలు ఇచ్చారు. చివరికి మే 10న సుప్రీంకోర్టుకు కూడా అవే నివేదికలు ఇచ్చి, అక్రమ తవ్వకాలు జరగడం లేదని చెప్పారు. వాటిని విశ్వసించని సుప్రీంకోర్టు... ఏపీలో ఇసుక తవ్వకాలపై రెండురోజుల్లో అధ్యయనం చేసి, క్షేత్రస్థాయి పరిశీలనతో నివేదిక ఇవ్వాలని అదేరోజున కేంద్ర అటవీ, పర్యావరణ శాఖను ఆదేశించింది. దీంతో విజయవాడ కేంద్రంగా ఉన్న ఎంవోఈఎఫ్ విభాగంలో ప్రముఖ శాస్త్రవేత్త పసుపులేటి సురే్‌షబాబు నేతృత్వంలోని నిపుణుల బృందం ఉమ్మడి కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించి సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి..
బీఆర్‌ఎస్‌కు తలనొప్పిగా మారిన ఎమ్మెల్యే
రేవంత్‌రెడ్డి కేబినెట్‌లో కొత్త మంత్రులు వీరే..?
ఆ మంత్రికి గైడ్ చేస్తున్నది ఎవరు?
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Jun 27 , 2024 | 08:17 AM