900 ఏండ్ల క్రితం చెక్కిన శిలా శాసనాలు..

ABN, Publish Date - Sep 05 , 2024 | 01:49 PM

విజయనగరం జిల్లా: శిలాశాసనాలు మన గత చరిత్రకు ప్రత్యక్ష్య సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఆ జిల్లాలోని 9 వందల సంవత్సరాల క్రితం రాళ్లపై రాసిన రాతలు నాటి పాలకుల పాలనకు ప్రతిబింబాలవుతున్నాయి. ఓ కోవెలలో కొలువైన రెండు శిలాశాసనాలపై ఇప్పుడు పురావస్తుశాఖ దృష్టి సారించింది.

విజయనగరం జిల్లా: శిలాశాసనాలు మన గత చరిత్రకు ప్రత్యక్ష్య సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఆ జిల్లాలోని 9 వందల సంవత్సరాల క్రితం రాళ్లపై రాసిన రాతలు నాటి పాలకుల పాలనకు ప్రతిబింబాలవుతున్నాయి. ఓ కోవెలలో కొలువైన రెండు శిలాశాసనాలపై ఇప్పుడు పురావస్తుశాఖ దృష్టి సారించింది. సంస్కృతం, తెలుగు భాషలలో లిఖించిన ఆ శిలాక్షరాలపై అద్యాయనం జరగవలసి ఉందని పరిశోధకులు ఓ నిర్ణయానికి రావడం జరిగింది.


విజయనగరం జిల్లాలో వెలుగులోకి వచ్చిన శిలాశాసనాలు పురావస్తుశాఖకు చెందిన పరిశోధకులను సయితం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. జిల్లాలోని జామిమండల కేంద్రంలో ఉన్న త్రిపురాంతక స్వామి వారి ఆలయంలో బయటపడిన ఈ శాసనాల్లో ఆ ప్రాంతం ఎంత పురాతనమైందో తేటతెల్లమవుతోంది. ఆలయంలో రెండు శిలాశాసనాలు ఉన్నాయనే విషయం తెలుసుకున్న ఏపీ గ్రాఫికల్ ఇండియా సొసైటికి చెందిన పురావస్తు శాస్త్రవేత్త వెంటక రాఘవేంద్రవర్మ తన బృందంతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ఉన్న రెండు శిలా శాసనాలపై ప్రాథమికంగా అధ్యాయనం చేశారు. తెలుగు, సంస్కృత భాషలకు చెందిన పద ప్రయోగం చేసి శిలలపై శాసనం చేసినట్లు గ్రహించారు. 9 వందల సంవత్సరాల క్రితం ఈ శిలాశాసనాన్ని ఒడిషాకు చెందిన తూర్పు గంగా చక్రవర్తి అనంతదేవ వర్మ చెక్కించినట్లు తెలుస్తోంది. కళింగ సామ్రాజ్యాన్ని ఏలిన రెండో చోళ గంగాదేవుడు ఈ ఆలయాన్ని సందర్శించినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్‌ రెడ్డితో బిగ్ షాట్‌ల భేటీ

తెలంగాణకు మళ్లీ వాన గండం

వెనక్కి తగ్గొద్దు ఎవరైనాసరే కూల్చేయండి..

ఏపీలో భారీ వర్షాలు.. అధికారుల హెచ్చరిక..

వరద బాధితులకు అండగా ABN

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 05 , 2024 | 01:49 PM