స్థానికులకు శ్రీవారి దర్శనం పునురుద్ధరణ

ABN, Publish Date - Dec 02 , 2024 | 01:40 PM

తిరుపతి: స్థానికులకు శ్రీవారి దర్శనం పునురుద్ధరణ జరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ప్రతినెల మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు.

తిరుపతి: స్థానికులకు శ్రీవారి దర్శనం పునురుద్ధరణ జరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ప్రతినెల మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. దీని కోసం తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమలలోని కమ్యూనిటీ హాలులో రెండు రోజుల ముందు టోకెన్లు జారీ చేస్తున్నారు. సీఎం చంద్రబాబు సూచనలతో తిరుపతితోపాటు చంద్రగిరి, రేణిగుంట వాసులకు దర్శనం కల్పించనున్నారు.


ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల పాలనలో తిరుమలలో చాలా మార్పులు వచ్చాయని, పూర్వ వైభవం తీసుకువచ్చామని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. గతంలో భక్తులు అనేక ఇబ్బందులు పడే వారని.. ప్రస్తుతం సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన స్వామి వారి దర్శనం కల్పిస్తున్నామని తెలిపారు. తిరుమలలో గతంలో అనేక వివాదాలు ఉండేవని.. ప్రస్తుతం ఎటువంటి వివాదాలు లేకుండా పరిపాలన సాగుతోందని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రేవంత్‌రెడ్డి రెడ్డి ఏడాది పాలనపై హరీష్‌రావు విమర్శలు

పెళ్లి వ్యవహారంతోనే మనస్థాపానికి గురై...

పులి జాడ కోసం కాగజ్‌నగర్ అడవుల్లో అన్వేషణ

కార్తీక మాసం చివరి రోజు పోలి పాడ్యమి..

ములుగు ఏజన్సీలో టెన్షన్ టెన్షన్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Dec 02 , 2024 | 01:40 PM