విచారణకు రాలేను.. 2 రోజుల టైమ్ కావాలి..
ABN, Publish Date - Oct 28 , 2024 | 02:06 PM
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు మోకిలా పోలీసులు సోమవారం విచారణకు రావాలంటూ ఇచ్చిన నోటీసులపై ఆయన స్పందించారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working President), మాజీ మంత్రి కేటీఆర్ (Ex Minister KTR) బావమరిది రాజ్ పాకాలకు (Raj Pakala) మోకిలా పోలీసులు (Police) సోమవారం విచారణకు రావాలంటూ ఇచ్చిన నోటీసులపై (Notices) ఆయన స్పందించారు. ఈరోజు విచారణకు రాలేనని తనకు రెండు రోజులు సమయం కావాలని కోరుతూ పోలీసులకు సమాచారం పంపారు. తన తరఫు న్యాయవాదులు వస్తారని తెలిపారు. మరోవైపు పోలీసులు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మధ్యాహ్నం కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే పోలీసులు నోటీసు ఇచ్చే సమయంలో రాజ్ పాకాల ఇంట్లో లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించారు. ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్‌లో ఉంది.
కాగా పోలీసులు బిఎన్‌ఎస్‌ఎస్ 35(3) సెక్షన్ ప్రకారం రాజ్ పాకాలకు నోటీసులు జారీ చేశారు. రేవ్ పార్టీ కేసుకు సంబంధించి విచారించాల్సి ఉందని పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు. సోమవారం తమ ముందు హాజరు కావాలన్నారు. అడ్రస్ ప్రూప్‌లతోపాటు, కేసుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని కోరారు. విచారణకు హాజరు కాకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు. ఈరోజు మోకిలా పీఎస్‌కు హాజరు కాకుంటే బిఎన్‌ఎస్‌ఎస్ 35 (3),(4),(5),(6) సెక్షన్ల ప్రకారం అరెస్టుకు దారి తీస్తుందని పేర్కొంటూ రాజ్ పాకాలకు మోకిలా ఇన్స్‌పెక్టర్ నోటీసులు జారీచేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీ హయాంలో భారీ స్కాం: జనసేన
రాజ్ పాకాలకు మోకిలా పోలీసుల నోటీసులు
సత్తెనపల్లిలో హై టెన్షన్.. టీడీపీ vs వైసీపీ..
అది జగన్ చేతకానితనానికి నిదర్శనం: షర్మిల
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Oct 28 , 2024 | 02:06 PM