మన్మోహన్ సింగ్‌కి ప్రధాని మోదీ నివాళి..
ABN, Publish Date - Dec 27 , 2024 | 11:24 AM
ఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్(Manmohan Singh) పార్థివదేహానికి ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) నివాళులు అర్పించారు.
ఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ (Manmohan Singh) పార్థివదేహానికి ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) నివాళులు అర్పించారు. అనారోగ్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ (Delhi AIMS)లో చికిత్సపొందుతూ గురువారం రాత్రి మన్మోహన్ సింగ్ మృతిచెందిన సంగతి తెలిసిందే. దీంతో భౌతికదేహాన్ని ఢిల్లీలోని ఆయన నివాసానికి తరలించారు. ఈ మేరకు ఇవాళ (శుక్రవారం) ఉదయం 10 గంటలకు ప్రధాని మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆయన ఇంటి వద్దకు చేరుకుని ఘన నివాళులు అర్పించారు. మన్మోహన్ సింగ్ భార్య గురుశరణ్ కౌర్, కుటుంబ సభ్యులను ప్రధాని పరామర్శించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, మల్లికార్జున ఖర్గే సైతం ఇవాళ ఉదయం మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి నివాళులు అర్పించి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.
Updated at - Dec 27 , 2024 | 11:46 AM