వర్రా రవీంద్రను అదుపులోకి తీసుకున్న ప్రత్యేక బృందాలు

ABN, Publish Date - Nov 08 , 2024 | 09:17 PM

సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వైఎస్ భారతీ పీఏ వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో ప్రత్యేక పోలీసు బృందాలు అతడిని అదుపులోకి తీసుకున్నాయి. అనంతరం అతడిని కడప జిల్లాకు తరలించినట్లు సమాచారం. దీంతో గత మూడు రోజులగా అతడి అరెస్ట్ వ్యవహారం నేటితో ఫుల్ స్టాప్ పడినట్లు అయింది.

మరోవైపు గతంలో.. అంటే వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో నాటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ సీనియర్ నేత వంగలపూడి అనితపైనే కాకుండా.. వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, వైఎస్ సునీతలపై సైతం వర్రా రవీందర్ రెడ్డి అసభ్యకర పోస్టింగ్‌లు పెట్టారు. ఈ సందర్బంగా అతడిపై పలు పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఆ క్రమంలో కడపలో మూడు రోజుల క్రితం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ ఆ వెంటనే అతడి వదిలి పెట్టారు.దీంతో ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్ అనివార్యమైంది.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Nov 08 , 2024 | 09:17 PM