మదనపల్లె ఘటన వెనక పెద్దిరెడ్డి హస్తం..!

ABN, Publish Date - Jul 23 , 2024 | 10:28 AM

అమరావతి: మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం మంటల్లో తగలబడింది. అందుకు . కరెంటు షార్ట్‌ సర్క్యూట్‌ కారణం కాదని ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. అసలు ‘కుట్ర’ ఏమిటో బయటపడాల్సి ఉంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన భూముల వ్యవహారాలతో ముడిపడిన ఫైళ్లు అక్కడే ఉండటం...

చిత్తూరు జిల్లా: మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం మంటల్లో తగలబడింది. అందుకు . కరెంటు షార్ట్‌ సర్క్యూట్‌ కారణం కాదని ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. అసలు ‘కుట్ర’ ఏమిటో బయటపడాల్సి ఉంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన భూముల వ్యవహారాలతో ముడిపడిన ఫైళ్లు అక్కడే ఉండటం... అత్యంత కీలకమైన నిషేధిత భూముల జాబితా సెక్షన్‌లోనే అగ్గి రాజుకోవడంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ సంఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ సోమవారం మధ్యాహ్నం సంఘటనా స్థలాన్ని సందర్శించారు. మూడు గంటల పాటు సంఘటనా స్థలాన్ని పరిశీలించి.. ఇది ప్ర మాదం కాదు.. ఉద్దేశ్యపూర్వకంగా జరిగిన సంఘటనగా తేల్చారు.


పోలీసులు, ఇతర వర్గాల సమాచారం ప్రకారం ఆదివారం రాత్రి 11 గంటల 15 నిముషాల సమయంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిప్పు రాజుకుంది. అక్కడ కాపలాగా ఉన్న నిమ్మనపల్లె అగ్రహారం వీఆర్ఏ రమణయ్య ఈ విషయాన్ని తొలుత గుర్తించారు. వెంటనే మండల డిప్యూటీ తహశీల్దారుకు ఫోన్‌లో ఈ సమాచారం అందించారు. డీటీ ఈ విషయాన్ని ఆర్డీవో క్యాంప్ క్లర్క్‌కు తెలియజేశారు. ఆ తర్వాత 11 గంటల 22 నిముషాలకు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. 11: 46 గంటలకు ఫైర్ ఇంజన్లు వచ్చాయి. గంట పాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకున్నారు. ఈ లోపే 25 విభాగాలకు చెందిన ఫైళ్లు బూడిదయ్యాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

కారు దిగనున్న మరో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ..!

ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు స్వీట్ వార్నింగ్

దేశంలో భారీగా పెరిగిన ఆహార ద్రవ్యోల్బణం

ఏపీలో రెండు షాకింగ్ ఘటనలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Jul 23 , 2024 | 10:28 AM