జగన్ నిర్లక్ష్యం వల్లే ఈ విపత్తు: పవన్ కల్యాణ్

ABN, Publish Date - Sep 04 , 2024 | 08:24 AM

విజయవాడ: వరద తీవ్రత.. సహాయక చర్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్ట్ర విపత్తుల కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంవల్లే ఈ విపత్తు సంభవించిందని అన్నారు. ఆర్మీ సహకారంతో వరద బాధితులకు సాయం అందిస్తున్నామని అన్నారు.

విజయవాడ: వరద తీవ్రత.. సహాయక చర్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్ట్ర విపత్తుల కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంవల్లే ఈ విపత్తు సంభవించిందని అన్నారు. ఆర్మీ సహకారంతో వరద బాధితులకు సాయం అందిస్తున్నామని అన్నారు. బుడమేరు నిర్వహణ సక్రమంగా లేకపోవడంవల్లే విజయవాడకు వరద పోటెత్తిందని పవన్ అన్నారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.


కాగా విజయవాడ, గుంటూరు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి వర్షం కురుస్తోంది. 2.30 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడటంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతోంది. నిన్న సాయంత్రం నుంచి ఆకాశం మేఘావృతం కావడంతో వరద పీడిత ప్రాంతాల ప్రజల్లో భయాందోళన నెలకొంది. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో నిన్న సాయంత్రానికి వరద నీరు కొంతమేర తగ్గింది. మళ్ళీ వర్షం పడటంతో ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్థిక సహాయంపై కిషన్‌రెడ్డి కీలక ప్రకటన..

కృష్ణమ్మ ఉగ్రరూపం.. లంక కన్నీళ్లు..

ఏపీకి భారీ విరాళాలు.. సీఎం కృతజ్ఞతలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Sep 04 , 2024 | 08:24 AM