వైసీపీ నేత బుగ్గనకు చేదు అనుభవం..

ABN, Publish Date - Oct 25 , 2024 | 12:57 PM

డోన్ మున్సిపల్ మైదానంలోకి శుక్రవారం ఉదయం బుగ్గన తన అనుచరులతో కలిసి వాకింగ్ కోసం వచ్చారు. అయితే గేట్‌కు తాళం వేసి ఉండడంతో అక్కడ ఉన్న మున్సిపల్ సిబ్బందిని ఆయన ప్రశ్నించారు. అధికారుల ఆదేశాల మేరకు తాము గేటుకు తాళం వేశామని సమాధానం ఇచ్చారు. దీంతో ఆయన మున్సిపల్ కమిషనర్‌కు ఫోన్ చేశారు.

నంద్యాల జిల్లా: డోన్‌లో మోర్నింగ్ వాక్‌కు వెళ్లిన వైసీపీ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. వాకింగ్ చేసేందుకు మైదానంలోకి వెళుతుండగా మున్సిపల్ సిబ్బంది గేట్‌కు తాళం వేశారు. ఎందుకు తాళం వేశారని మున్సిపల్ కమిషనర్‌కు బుగ్గన ఫోన్ చేశారు. అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో అసహనానికి గురయ్యారు. కొద్దిసేపు స్టేడియం బయట అరుగుపై కూర్చున్నారు. అధికారులు ఎవరూ స్పందించకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయారు.


డోన్ మున్సిపల్ మైదానంలోకి శుక్రవారం ఉదయం బుగ్గన తన అనుచరులతో కలిసి వాకింగ్ కోసం వచ్చారు. అయితే గేట్‌కు తాళం వేసి ఉండడంతో అక్కడ ఉన్న మున్సిపల్ సిబ్బందిని ఆయన ప్రశ్నించారు. అధికారుల ఆదేశాల మేరకు తాము గేటుకు తాళం వేశామని సమాధానం ఇచ్చారు. దీంతో ఆయన మున్సిపల్ కమిషనర్‌కు ఫోన్ చేశారు. స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎవరికైనా సమస్య వస్తే ఎవరి చెప్పాలన్నారు. పరిస్థితి ఇలా ఉంటే మైదానంలో వాకింగ్ ఎలా చేస్తారని బుగ్గన అన్నారు. అయితే మున్సిపల్ సిబ్బంది గేట్ తాళం తీస్తారేమోనని బుగ్గన అక్కడే కొద్ది సేపు ఉన్నారు. అయినా గేట్ తాళం తీయకపోవడంతో ఆయన అసహనం వ్యక్లం చేస్తూ తిరిగి ఇంటికి వెళ్లిపోయారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు దోహద పడుతుంది

మరోసారి జిల్లాల పునర్విభజన వివాదం..

కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై కేసు నమోదు..

నాలుగు హోటళ్లకు బాంబు బెదిరింపులు.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Oct 25 , 2024 | 12:57 PM