బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మంత్రి సీతక్క కౌంటర్ ..
ABN, Publish Date - Dec 16 , 2024 | 12:18 PM
హైదరాబాద్: అసెంబ్లీలో ప్రశ్నోత్తర సమయంలో సర్పంచుల బిల్లులు పెండింగ్‌పై జరిగిన చర్చలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, రాజేశ్వర్ రెడ్డి, వెంకటరమణ రెడ్డి, కోవా లక్ష్మి, నాయిని రాజేందర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. వారి ప్రశ్నలకు మంత్రి సీతక్క స్టాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు.
హైదరాబాద్: అసెంబ్లీలో ప్రశ్నోత్తర సమయంలో సర్పంచుల బిల్లులు పెండింగ్‌పై జరిగిన చర్చలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, రాజేశ్వర్ రెడ్డి, వెంకటరమణ రెడ్డి, కోవా లక్ష్మి, నాయిని రాజేందర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. వారి ప్రశ్నలకు మంత్రి సీతక్క స్టాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు. సర్పంచుల బిల్లులు పెండింగ్ పెట్టిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని, ఆ పెండింగ్ బిల్లుల బరువు మేం మోస్తున్నామన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్ని అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ఆ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు రూ.1000 కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు.
సర్పంచ్‌ల పదవి కాలం ఫిబ్రవరిలో ముగిసిందని, ఇప్పుడున్న పెండింగ్ బిల్లులు బీఆర్ఎస్ నుంచి వారసత్వంగా వచ్చినవేనని మంత్రి సీతక్క అన్నారు. హరీష్ రావు ఫైనాన్స్ మంత్రిగా ఆనాడు సంతకం పెడితే బిల్లులు క్లియర్ అయ్యేవికదా అని అన్నారు. కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులు ఇవ్వలేదని, తాము పెండింగ్ బిల్లులు చెల్లించం అనడం లేదని చెప్పారు. కచ్చితంగా బీఆర్ఎస్ వారసత్వంగా ఇచ్చిన బకాయిలు, పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని సీతక్క స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
KC రెడ్డి ఫార్మసీ కాలేజీలో దారుణం..
జగన్ నిర్వాకం.. రైతుల కష్టాలు..
ABN Live..: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..
తిరుమల శ్రీవారి దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Dec 16 , 2024 | 12:40 PM