సారీ సార్..! జోగి రమేష్ ను నేను పిలవలేదు..
ABN, Publish Date - Dec 17 , 2024 | 03:43 PM
టీడీపీ నేతలతో వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ వేదిక పంచుకున్న ఘటనపై మంత్రి కొలుసు పార్థసారధి వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి జోగి రమేష్ ను ఆహ్వానించి ఉండవచ్చునన్నారు. ఈ ఘటనపై పార్టీ కార్యకర్తలకు మంత్రి పార్థసారథి క్షమాపణలు చెప్పారు.
టీడీపీ నేతలతో వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ వేదిక పంచుకున్న ఘటనపై మంత్రి కొలుసు పార్థసారధి వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి జోగి రమేష్ ను ఆహ్వానించి ఉండవచ్చునన్నారు. ఈ ఘటనపై పార్టీ కార్యకర్తలకు మంత్రి పార్థసారథి క్షమాపణలు చెప్పారు. ఇకపై ఈ తరహా ఘటనలు జరగకుండా చూసుకుంటామన్నారు. సర్దార్ గౌత్ లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథితోపాటు గౌతు శిరిష హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి జోగి రమేష్ సైతం విచ్చేశారు. దీంతో ఈ వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తాయి. అదీకాక జోగి రమేష్.. గత ప్రభుత్వ హయాంలో సీఎం చంద్రబాబును లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేసిన విషయం విధితమే. ఆ క్రమంలో మంత్రి కొలుసు పార్థసారథిపై విధంగా వివరణ ఇచ్చారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Dec 17 , 2024 | 03:44 PM