ఏపీలో పలు విమానాలు రద్దు..
ABN, Publish Date - Dec 01 , 2024 | 01:56 PM
తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలోని అనేక ప్రాంతాల్లోని ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండగా మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి చిత్తూరు జిల్లాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ.. అక్కడక్కడ కుంభవృష్టి వర్షాలు కురిసాయి. సముద్రంలో అలలు ఎగిసి పడుతున్నాయి. దీంతో విశాఖ, తిరుపతిలో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి.
అమరావతి: తుఫాన్ ప్రభావంతో తమిళనాడుతోపాటు ఏపీలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి మహాబలిపురం, కారైక్కాల్ మధ్య, పుదుచ్చేరి సమీపంలో తుఫాన్ తీరం దాటింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలోని అనేక ప్రాంతాల్లోని ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండగా మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి చిత్తూరు జిల్లాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ.. అక్కడక్కడ కుంభవృష్టి వర్షాలు కురిసాయి. సముద్రంలో అలలు ఎగిసి పడుతున్నాయి. విశాఖ, తిరుపతిలో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి.
తమిళనాడును ఫెంగల్ తుఫాన్ అతలా కుతలం చేసింది. చెన్నైలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అటు తమిళనాడులో భారీ వర్షాలకు చెన్నై విమానాశ్రయంలో సయితం నీరు చేరింది. రన్‌వేలు నీటిలో ఉండడంతో విమానాలు దిగేందుకు.. ఎగిరేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. వర్షం ఉధృతి పెరగడంతో కొన్ని గంటలు విమానాశ్రయాన్ని మూసేయించాల్సి వచ్చింది. అటు చెన్నైవిమానాశ్రయంలో ఓ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఇండిగో ఎయిర్ లైన్స్.. ఎయిర్ బస్సు విమానం ల్యాండ్ అవడానికి ప్రయత్నించగా ప్రతికూల వాతావరణ పరిస్థితులతో నియంత్రణ కోల్పోయింది. దాంతో తిరిగి గాల్లోకి ఎగిరింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ సినిమా నిర్మాత, దర్శకుడిని ఎందుకు సన్మానించలేదు
కాగజ్‌నగర్, సర్పూర్ టీ మండలాల్లో 144 సెక్షన్
సస్పెండైన ఏఈఈ నిఖేష్ కుమార్ బాగోతం..
అవినాష్ రెడ్డి బాధితుడికి కూటమి ప్రభుత్వం న్యాయం..
స్టెల్లా షిప్‌కు నో డ్యూ సర్టిఫికెట్‌కు నిరాకరణ
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Dec 01 , 2024 | 01:56 PM