ఏపీ అసెంబ్లీ నుంచి జగన్ జంప్..
ABN, Publish Date - Jul 23 , 2024 | 07:46 AM
అమరావతి: అసెంబ్లీకి వచ్చేందుకు జగన్ భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గతంలో ప్రమాణస్వీకారం చేసిన వెంటనే వెళ్లిపోయిన జగన్.. నిన్న గవర్నర్ ప్రసంగం జరుగుతుండగానే మధ్యలోనే వెళ్లిపోయారు. ఢిల్లీలో ధర్నా పేరుతో అసెంబ్లీ నుంచి జగన్ పరారయ్యారని చాలా మంది వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: అసెంబ్లీకి వచ్చేందుకు జగన్ భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గతంలో ప్రమాణస్వీకారం చేసిన వెంటనే వెళ్లిపోయిన జగన్.. నిన్న గవర్నర్ ప్రసంగం జరుగుతుండగానే మధ్యలోనే వెళ్లిపోయారు. ఢిల్లీలో ధర్నా పేరుతో అసెంబ్లీ నుంచి జగన్ పరారయ్యారని చాలా మంది విమర్శలు చేశారు. బుధవారం ఢిల్లీలో ధర్నాకు దిగుతున్నారని, దీనికి సంబంధించి వైసీపీ నేతలకు జగన్ పిలుపిచ్చారు. ఇతర పార్టీల నుంచి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని అన్నారు. విషయంలేని ధర్నాకు ఎవరు వచ్చి మద్దతు తెలుపుతారో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తోంది.
అసెంబ్లీ ప్రాంగణంలో వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పోలీసు అధికారులపై రెచ్చిపోయారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల మొదటి రోజునే తన అసహనాన్ని ప్రదర్శించారు. పోలీసు అధికారిని ఏకవచనంతో, పేరు పెట్టి పిలిచి మరీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం జగన్ అధికారిక హోదా ‘ఎమ్మెల్యే’ మాత్రమే. ప్రతిపక్షనేత హోదా కూడా లేదు. ముఖ్యమంత్రి, మంత్రులు మినహా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల వాహనాలను అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించరు. ప్రతిపక్ష నేత హోదాలేని జగన్ వాహనాన్ని సోమవారంభద్రతా సిబ్బంది అసెంబ్లీ నాలుగో నంబరు గేటు వద్ద నిలిపివేశారు. ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి జగన్ నల్ల కండువాలు ధరించి, ప్లకార్డులతో ప్రదర్శనగా వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. వాటికి అనుమతి లేదని స్వాధీనం చేసుకున్నారు. ప్లకార్డులను, పేపర్లను లాగేసుకున్నారు. దీంతో జగన్ ఆగ్రహంతో ఊగిపోయారు. ప్లకార్డులు చించే అధికారం ఎవరిచ్చారని భద్రతా సిబ్బందిని నిలదీశారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని.. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పోలవరానికి 12,157 కోట్లివ్వండి
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Aug 11 , 2024 | 02:23 PM